Japan: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కల తీరడం లేదు. చంద్రుడిపై కాలు మోపాలనే తపన నెరవేరడం లేదు. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల కింద చేపట్టిన చంద్రయాన్ 2 యాత్ర నిరాశ పరచింది. చంద్రుడిపై కాలు మోపాలని చూస్తున్న మన వారి ఆశలు తీరడం లేదు. దీంతో ఇన్నాళ్ల నిరీక్షణ నీరుగారిపోయింది. అయినా మన శాస్త్రవేత్తలు సాధిస్తారనే నమ్మకం భారతీయుల్లో బలంగా ఉంది. ఇన్నాళ్లుగా ఎన్నో విజయవంతమైన ఉపగ్రహాలు ప్రవేశపెట్టిన ఇస్రో ఈ ఒక్క లక్ష్యం మాత్రం చేధించడం లేదు. దీంతో మళ్లీ ప్రయత్నించాలని చూస్తోంది.
చందమామకు 2.1 కిలోమీటర్ల దూరంలో భారత్ ప్రయోగించిన విక్రమ్ ల్యాండర్ క్రాష్ అయింది. దీంతో ల్యాండర్ నుంచి ఎలాంటి సంకేతాలు అందలేదు. దాని శకలాలు మాత్రం కనిపించాయి. మరోసారి మనకు చేదు అనుభవమే ఎదురైంది. ఇస్రో సాధించిన విజయాలతో పోలిస్తే అపజయాలు పెద్ద లెక్కలోకి రావు. కానీ చిరకాల వాంఛ అయిన చంద్రయాన్ ప్రయత్నం సఫలం కావడం లేదు.
జాబిల్లిపై అడుగు పెట్టాలనే ఆలోచనతో జపాన్ కు చెందిన ప్రైవేటు సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలోనే చంద్రయాన్ 2 ప్రయోగం చేసింది. ఆ సంస్థ పంపించిన స్పేస్ క్రాఫ్ట్ క్రాష్ కావడం ఆందోళన కలిగిస్తోంది. చంద్రునిపై కాలు మోపే సమయానికి దానితో సంబంధాలు తెగిపోయాయి. పునరుద్ధరించినా ఫలితం కనిపించలేదు. చివరకు నిరాశే మిగిలింది.
ఐ స్పేస్ అనే ఓ ప్రైవేటు స్టార్టప్ ఈ మిషన్ ను ప్రారంభించింది. డిసెంబర్ 11న ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ నుంచి స్పేస్ ఎక్స్ తయారు చేసిన పాల్కన్ -9 రాకెట్ సాయంతో ల్యాండర్ ను చంద్రుడిపైకి పంపింది. దీనిపేరు హకుటో ఆర్ 1. దీనికి ల్యాండర్ నడవడానికి రోవర్ ను యూఏఈ సమకూర్చింది. ప్రయోగించిన నెల తరువాత చంద్రుడిపై కక్ష్యలోకి అడుగు పెట్టింది ఈ ల్యాండర్.
మంగళవారం రాత్రి చంద్రుడిపై ల్యాండ్ చేయడానికి ప్రయత్నించింది. అట్లాస్ క్రెటర్ పై దించాలని చూసినా కుదరలేదు. చివరకు క్రాష్ అయింది. ఇంతవరకు అమెరికా, రష్యా, చైనా మాత్రమే చంద్రుడిపై ప్రయోగాలను విజయవతం చేశాయి. మన దేశం మాత్రం ఆ ఘనత సాధించకపోవడంపై అందరు ఆందోళనకు గురవుతున్నారు.