https://oktelugu.com/

YEAR ENDER 2024: ఈ ఏడాది ట్రెండ్ అయిన హెయిర్ స్టైల్స్ ఇవే!

అందంగా కనిపించాలని అమ్మాయిలు ఎక్కువ రకాల హెయిర్ స్టైల్స్ వేస్తుంటారు. టెండ్రీ లుక్స్‌లో మార్కెట్‌లోకి వచ్చిన ప్రతీ హెయిర్ స్టైల్‌ను ఫాలో అవుతుంటారు. అయితే ఈ ఏడాది ఎన్నో రకాల హెయిర్ స్టైల్ వచ్చాయి. కానీ అందులో కొన్ని మాత్రమే బాగా ట్రెండ్ అయ్యాయి. సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ఈ ఏడాది ఎక్కువగా వేసుకున్న ఆ హెయిర్ స్టైల్స్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 30, 2024 / 01:31 AM IST
    Follow us on

    YEAR ENDER 2024: అమ్మాయిలకు ఫ్యాషన్ అంటే పిచ్చి. ఏదైనా కొత్త ఫ్యాషన్‌ను వారే ముందుగా మార్కెట్‌లోకి తీసుకురావాలని అనుకుంటారు. అందుకే ఎప్పటికప్పుడు కొత్త మోడల్‌లో ఉండే దుస్తులు, రింగులు ఇలా అన్నింట్లో ఫ్యాషన్ చూసుకుంటారు. పొరపాటున ఏదైనా ఫ్యాషన్ మార్కెట్‌లోకి వస్తే చాలు.. ఇక దాన్ని ఫాలో కాకుండా అసలు ఉండలేరు. అయితే ప్రతీ ఏడాది ఒక్కో కొత్త రకం ట్రెండ్ అవుతుంది. వేసుకునే దుస్తుల నుంచి పెట్టుకునే బొట్టు వరకూ అన్ని కూడా రకరకాల మోడల్స్ వచ్చాయి. అయితే ఈ ఏడాది చాలా హెయిర్ స్టైల్‌లు మార్కెట్‌లోకి వచ్చాయి. అమ్మాయిలకు అందం జుట్టు. ఎంత బాగా రెడీ అయిన కూడా దానికి తగ్గట్టు హెయిర్ స్టైల్ లేకపోతే మాత్రం వేస్ట్. అందంగా కనిపించాలని అమ్మాయిలు ఎక్కువ రకాల హెయిర్ స్టైల్స్ వేస్తుంటారు. టెండ్రీ లుక్స్‌లో మార్కెట్‌లోకి వచ్చిన ప్రతీ హెయిర్ స్టైల్‌ను ఫాలో అవుతుంటారు. అయితే ఈ ఏడాది ఎన్నో రకాల హెయిర్ స్టైల్ వచ్చాయి. కానీ అందులో కొన్ని మాత్రమే బాగా ట్రెండ్ అయ్యాయి. సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ఈ ఏడాది ఎక్కువగా వేసుకున్న ఆ హెయిర్ స్టైల్స్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

    షార్ట్ హెయిర్
    జుట్టు ఎక్కువగా మందంగా ఉంటేనే అమ్మాయిలకు అందం. కానీ కొందరు అమ్మాయిలు ఈ ఏడాదిలో ఎక్కువగా షార్ట్ హెయిర్‌గా చేసుకున్నారు. ఎంత ఎక్కువ జుట్టు ఉన్నా కూడా షార్ట్‌గా హెయిర్ ఉంటే స్టైలిష్‌గా ఉంటారని భావించి చాలా మంది అమ్మాయిలు షార్ట్ హెయిర్ ట్రెండ్‌ను పాటించారు. ఆఖరికి సెలబ్రిటీలు కూడా ఇదే ట్రెండ్‌ను ఫాలో అయ్యారు. చిన్న జుట్టుతో స్టైలిష్‌గా కనిపించడంతో పాటు మెయిన్‌టైన్ చేయడం కూడా ఈజీగా ఉంటుందని భావించి చాలా మంది షార్ట్ హెయిర్ ట్రెండ్‌ను పాటించారు. ఈ ఏడాది బాగా పాపులర్ అయిన హెయిర్ స్టైల్‌లో ఇది ఒకటి.

    ఉంగరాల జుట్టు
    కర్లీ హెయిర్ చూడటానికి చాలా బాగుంటుంది. ఈ ఏడాది చాలా సినిమాల్లో కర్లీ హెయిర్ రావడంతో.. అమ్మాయిలు ఎక్కువగా ఈ హెయిర్‌కి ప్రాధాన్యత ఇస్తారు. ఈ ఏడాది పాపులర్ అయిన హెయిర్ స్టైల్స్‌లో ఉంగరాల జుట్టు ఒకటి. ఎన్ని జనరేషన్లు వచ్చిన కూడా కర్లీ హెయిర్ బోర్ కొట్టదు. కర్లీ హెయిర్ ముఖాన్ని అందంగా మార్చేయగలదు. మీకు తెలియకుండానే మీరు చాలా అందంగా కనిపిస్తారు.

    హాఫ్ అప్ హాఫ్ డౌన్
    హాఫ్ అప్ హాఫ్ డౌన్ హెయిర్‌ స్టైల్ ఈ ఏడాది బాగా పాపులర్ అయిన వాటిలో ఒకటి. ఈ హెయిర్ స్టైల్‌లో ఆఫ్ జుట్టు వంకరగా, ఇంకో హాఫ్ జుట్టు స్ట్రైట్‌గా ఉంటుంది. ఈ హెయిర్ స్టైల్ ఏ దుస్తుల మీదకు అయిన కూడా ఈజీగా సెట్ అవుతుంది.

    స్లిక్ బన్ స్లిక్ బన్స్ హెయిర్ స్టైల్
    ఈ హెయిర్ స్టైల్ కూడా ఈ ఏడాదిలో బాగా పాపులర్ అయ్యింది. ఏదైనా చిన్న ఫంక్షన్ లేదా ఏదైనా ఈవెంట్‌కి అయిన కూడా ఎక్కువ మంది ఈ హెయిర్ స్టైల్‌ను వేసుకునేవారు. ఈ హెయిర్ స్టైల్ చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటుంది.