Homeఅంతర్జాతీయంIvanka Trump: ఇవాంకా.. మజాకా.. బరిలో దిగితే ప్రత్యర్థి చిత్తే!

Ivanka Trump: ఇవాంకా.. మజాకా.. బరిలో దిగితే ప్రత్యర్థి చిత్తే!

Ivanka Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) కూతురు ఇవాంక ట్రంప్‌. అందమైన ఇంవాంక మార్షల్‌ ఆర్ట్స్‌ నిపుణురాలు. అందంతో ఆకట్టుకునే ఇవాంకలో ఈ కోణం ఉందని చాలా మందికి తెలియదు. తాజాగా ఆమె మార్షల్‌ ఆర్ట్స్‌(Marshal Arts)లో సంత్తా చాటింది. ప్రత్యర్థిని మట్టికరిపించి అభిమానుల మనసు గెలుచుకుంది. బ్రెజిలియన్‌ జియు–జిట్సు (BJJ) అనే మార్షల్‌ ఆర్ట్‌లో తన నైపుణ్యంతో అందరి దృష్టిని ఆకర్షించింది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన వీడియోలు ఆమె శిక్షణలో ప్రత్యర్థిని సమర్థవంతంగా ఓడించిన దృశ్యాలను చూపించాయి. ఈ క్రీడలో ఆమె సాధించిన బ్లూ బెల్ట్‌ హోదా ఆమె నిబద్ధతకు నిదర్శనం.

శిక్షణ ప్రారంభం..
మయామి(Mayami)లోని వాలెంటే బ్రదర్స్‌ స్టూడియోలో ఇవాంక ఈ శిక్షణను ప్రారంభించింది. ఆమె కుమార్తె అరబెల్లా స్వీయ రక్షణ నేర్చుకోవాలనే ఉద్దేశంతో మొదలైన ఈ ప్రయాణంలో, ఆమె భర్త జారెడ్‌ కుష్నర్, ఇద్దరు కుమారులు కూడా చేరారు. జియు–జిట్సు ఆమె కుటుంబానికి ఒక బంధన శక్తిగా మారింది. 2025 మార్చి 22న జరిగిన శిక్షణ సెషన్‌(Training Session)లో ఆమె తన శిక్షకుడిని మట్టిలో పడగొట్టడం, కత్తి దాడిని ఎదుర్కోవడం వంటి రక్షణాత్మక టెక్నిక్‌లను ప్రదర్శించింది.

సోషల్‌ మీడియాలో వైరల్‌..
వాలెంటే బ్రదర్స్‌ ఈ వీడియోను షేర్‌ చేస్తూ, ‘జియు–జిట్సు కేవలం ఒక మార్షల్‌ ఆర్ట్‌ కాదు. ఇది శారీరక ఆత్మవిశ్వాసం, మానసిక స్పష్టత, భావోద్వేగ సమతుల్యతను అందిస్తుంది‘ అని వ్యాఖ్యానించారు. ఇవాంక ఈ క్రీడను ‘మూవింగ్‌ మెడిటేషన్‌‘గా అభివర్ణించింది, ఇది శారీరక కదలికలతో పాటు తాత్విక లోతును కలిగి ఉందని చెప్పింది. ఈ శిక్షణలో ఆమె ప్రత్యర్థిని ఓడించడం అక్షరార్థ పోటీ కంటే, రక్షణాత్మక నైపుణ్యాల ప్రదర్శనగా భావించాలి.

ఇవాంక జియు–జిట్సులో చూపిన పట్టుదల ఆమె రాజకీయాల నుంచి దూరంగా ఉంటూ, వ్యక్తిగత జీవితంలో కొత్త ఆసక్తులను అన్వేషిస్తున్న సమయంలో వచ్చింది. ఈ వీడియోలు ఆమె శారీరక దృఢత్వాన్ని, మానసిక దృఢత్వాన్ని ప్రతిబింబిస్తాయి. ఆమె నైపుణ్యం అభిమానులను ఆకట్టుకుంది, జియు–జిట్సు యొక్క ఆకర్షణను మరింత పెంచింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular