Israel: పశ్చిమాసియా.. యుద్ధంతో రగిలిపోతోంది. ఇజ్రాయెల్, హెజ్‌బొల్లా మధ్య భీకర పోరు సాగుతోంది. దీంతో మశ్చిమాసియా రక్తసిక్తమవుతోంది. దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయోల్ బాంబులతో విరుచుకుపడుతోంది. దీంతో సైదా, మరజుయాన్, టైర్, జహరానితోపాటు బెకా లోయలోని పలు జిల్లాలు భయంతో వణికిపోతున్నాయి. ప్రజలు ప్రాణభయంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. మరోవైపు హెజ్‌బొల్లా కూడా ఇజ్రాయెల్‌పై బాంబులతో దాడి చేస్తోంది. ఈ క్రమంలో లెబనాన్ ప్రజలకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ కీలక హెచ్చరిక చేశారు. హెజ్‌బొల్లాకు ఎవరూ అండగా ఉండొద్దని సూచించారు. రక్షణ కవచాలుగా ఉండాలని భావిస్తే ప్రాణాలు కోల్పోక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. పౌరులతో తాము యుద్ధం చేయడం లేదుని హెజ్‌బొల్లాతోనే యుద్ధం చేస్తున్నామన్నారు. హెజ్‌బొల్లా పౌరులను తమ రక్షణకువాడుకుంటోందని తెలిపారు. ప్రజల సాయంతోనే ఇజ్రాయెల్‌పై దాడి చేస్తోందని తెలిపారు. తమ దేశ ప్రజల ప్రాణాలు కాపాడేందుకే తాము హెజ్‌బొల్లాపై దాడి చేస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో హెజ్‌బొల్లాకు అండగా నిలవడం మానుకోవాలని సూచించారు.
ఆయుధాలు నిర్వీర్యం చేయండి..
హెచ్‌బొల్లా కొన్నేల్లుగా ప్రజల ఇళ్లనే ఆయుధ కర్మాగారంగా మార్చుకుందని నెతన్యాహూ తెలిపారు. ఇప్పుడు కీలక సమయంలో మీ ఇళ్లలో ఉన్న ఆయుధాలను నిర్వీర్యం చేయాలని సూచించారు. హెజ్‌బొల్లా కారణంగా సామాన్యులు ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దన్నారు. లెబనాన్‌ను నాశనం చేయనివొద్దని తెలిపారు. హానికర పరిస్థితుల నుంచి ప్రజలు బయటపడాలని పేర్కొన్నారు. హెజ్‌బొల్లా లక్ష్యంగా తాము చేపట్టిన ఆపరేషన్ పూర్తయిన వెంటనే తిరిగి ఇళ్లకు వెళ్లాలని సూచించారు.
భీకర యుద్ధం..
నెతన్యాహూ హెచ్చరికలను బట్టి చూస్తే ఇజ్రాయెల్ దాడులు ఇప్పట్లో ఆగే అవకాశం కనిపించడం లేదు. హెజ్‌బొల్లాను పూర్తిగా తుడిచిపెట్టాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే హెజ్‌బొల్లా ఆయుధాలు దాచిన బెకా లోయనూ ధ్వంసం చేస్తామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. లోయలో ఆయుధాలు దాచిన పౌరులు నివాసాలు వదిలి పోవాలని సైనిక 6పతినిధి రియర్ అడ్మిరల్ డానియెల్ హగారీ సూచించారు.
పెరుగుతున్న మరణాలు..
ఇదిలాం ఉంటే.ఇజ్రాయెల్ దాడులతో లెబనాన్‌లో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే 492 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సంఖ్య ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించిన మరణాల్లో 90 మందికిపైగా మహిళలు చిన్నారులు ఉన్నారు. మరో 1,600 మంది గాయపడినట్లు తెలిపారు. కాగా, లెబనాన్‌పై ఈస్థాయిలో సైనిక చర్య 2006 తర్వాత మళ్లీ ఇప్పుడే అంటున్నారు నిపుణులు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read More