Israel Shocks Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను ప్రపంచ వ్యాప్తంగా పలు యుద్ధాలు ఆపానని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడు. ఇందుకు తాను నోబెల్ శాంతి బహుమతిని అర్హుడనని పదేపదే చెప్పుకుంటున్నాడు. ట్రంప్ సెల్ఫ్ డబ్బాకు పాకిస్తాన్, అజర్‌బైజాన్ వంటి దేశాలు మద్దతు తెలిపాయి. కానీ, వాస్తవ పరిస్థితి మాత్రం యుద్ధాలు ఆగిన దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. ఇస్తున్నప్పటికీ రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతోంది, ఇజ్రాయెల్ గాజాపై దాడులు ముమ్మరం చేస్తోంది. గాజాలో బఫర్ జోన్ ఏర్పాటు, గ్రేటర్ ఇజ్రాయెల్ ఆలోచనల నేపథ్యంలో పాలస్తీనియన్లు భారీ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు.
శాంతి దూతగా సెల్ఫ్ ప్రమోదషన్..
ట్రంప్ తన 2.0 పాలనలో వివాదాస్పద నిర్ణయాలు, ప్రకటనలతో పరువు పోగొట్టుకుంటున్నారు. తాను అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో యుద్ధాలు ఆపేస్తానని ఎన్నికల సమయంలో ప్రకటించారు. కానీ 8 నెలలు దాటినా ఇప్పటికీ ఆ పని చేయలేదు. అయినా ఇజ్రాయెల్–ఇరాన్, భారత్–పాకిస్తాన్, అర్మేనియా–అజర్‌బైజాన్ వంటి సంఘర్షణలను పరిష్కరించినట్లు పేర్కొంటూ నోబెల్ శాంతి బహుమతికి తనను తాను ప్రమోట్ చేసుకుంటున్నారు. పాకిస్తాన్, అజర్‌బైజాన్, ఇజ్రాయెల్ వంటి దేశాలు ఆయనకు మద్దతు ఇచ్చాయి. పాకిస్తాన్ భారత్–పాకిస్తాన్ సంక్షోభంలో ట్రంప్ జోక్యాన్ని ప్రశంసిస్తూ నోబెల్ బహుమతి కోసం సిఫారసు చేసింది. అజర్‌బైజాన్, అర్మేనియా నాయకులు కూడా నాగోర్నో–కరాబాఖ్ సంఘర్షణ పరిష్కారంలో ట్రంప్ పాత్రను కొనియాడారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇజ్రాయెల్–ఇరాన్ ఆపరేషన్‌లో ట్రంప్ సహకారాన్ని గుర్తించి నామినేషన్‌ను సమర్థించారు.
ఇజ్రాయెల్ దూకుడు..
ఇజ్రాయెల్ గాజాపై తీవ్ర దాడులను కొనసాగిస్తోంది, ఇటీవల ఒకే దాడిలో 80 మంది వరకు మరణించారు. గాజాను స్వాధీనం చేసుకుని బఫర్ జోన్‌గా మార్చాలని, దీర్ఘకాలంలో గ్రేటర్ ఇజ్రాయెల్‌గా రూపొందించాలని ఇజ్రాయెల్ భావిస్తోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ ఆగిందని చెబుతున్న ఇజ్రాయెల్ వార్ ఇప్పటికీ కొనసాగిస్తోంది. దీంతో ట్రంప్ ప్రతిపాదనను తిరస్కరిస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి గాజా నివాసులను దక్షిణ గాజాలోని ఒక క్యాంప్‌లోకి తరలించి, హమాస్ ఆపరేటివ్‌లను వేరుచేసే ప్రణాళికను రూపొందించమని సైన్యానికి ఆదేశించారు. ఈ ప్రణాళికను ఒక ఇజ్రాయెల్ మానవ హక్కుల న్యాయవాది ‘మానవతా వ్యతిరేక నేరం‘గా అభివర్ణించారు. అయినా ట్రంప్ దీనిని వ్యతిరేకించకపోవడం గమనార్హం. ట్రంప్ గాజాలో శాంతి కోసం ఒత్తిడి చేస్తున్నప్పటికీ, ఇజ్రాయెల్ దాడులను ఆపకపోవడం అమెరికాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ట్రంప్ సిఫారసు చేసిన 60 రోజుల సీజ్‌ఫైర్‌కు ఇజ్రాయెల్ పూర్తిగా కట్టుబడలేదని, హమాస్‌ను పూర్తిగా తొలగించాలని నెతన్యాహు పట్టుబడుతున్నారని పాలస్తీనియన్ అధికారులు పేర్కొన్నారు.
కొనసాగుతున్న రష్యా–ఉక్రెయిన్ యుద్ధం..
ట్రంప్ తన ప్రచారంలో 24 గంటల్లో రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతానని హామీ ఇచ్చారు. అయితే, ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంది, దాదాపు 1.5 మిలియన్ల మంది గాయపడ్డారు లేదా మరణించారు. ఇటీవల యుద్ధం ఆపే ప్రయత్నంలో భాగంగా పుతిన్‌తో సమావేశమయ్యారు. తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్‌స్కీని కలిశారు. కానీ ముగ్గురూ కలిసి మాట్లాడతారన్న ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు., మరోవైపు అమెరికా, యురోపియన్ యూనియన్ ఉక్రెయిన్‌కు ఆయుధ సరఫరాను కొనసాగిస్తున్నాయి. దీంతో పుతిన్‌తో జరిగిన సమావేశాలు ‘లిజనింగ్ సెషన్‘గా పరిమితమయ్యాయి. దీంతో ఉక్రెయిన్ ఎంపీ మెరెజ్కో ట్రంప్‌పై నమ్మకాన్ని కోల్పోయి, ఆయన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు, ట్రంప్ రష్యాపై ఒత్తిడి తీసుకురాకపోవడంతో నిరాశ వ్యక్తం చేశారు.