Homeఅంతర్జాతీయంSaddam Hussein: ఇజ్రాయిల్ మొస్సాద్ ను పడుకోబెట్టాడు.. చావును వెంట్రుకతో తీసిపడేశాడు.. జేమ్స్ బాండ్...

Saddam Hussein: ఇజ్రాయిల్ మొస్సాద్ ను పడుకోబెట్టాడు.. చావును వెంట్రుకతో తీసిపడేశాడు.. జేమ్స్ బాండ్ లాంటి స్టోరీ ఇది

Saddam Hussein: సీక్రెట్ ఆపరేషన్ ల గురించి చర్చ మొదలైతే.. అమెరికా డీప్ స్టేట్ కంటే.. రష్యా సీక్రెట్ వింగ్ కంటే.. అత్యంత పటిష్టమైనది ఇజ్రాయిల్ దేశానికి చెందిన మొస్సాద్ అని అందరూ చెబుతుంటారు. ప్రపంచ దేశాల సైతం దీనిని అంగీకరిస్తుంటాయి. కానీ కొంతమంది విదేశీ నిపుణులు.. ముఖ్యంగా సీక్రెట్ ఆపరేషన్లలో తల పండినవారు దీనిని ఒప్పుకోరు. ముఖ్యంగా 90వ దశకం నాటి పరిస్థితులను దగ్గర నుండి చూసినవారు ఏమాత్రం మొస్సాద్ తోపు అని అంగీకరించరు. ఎందుకంటే దీని వెనుక పెద్ద స్టోరీ ఉంది. అది జేమ్స్ బాండ్ సినిమాను మించి ఉంటుంది. ప్రతి సన్నివేశం కూడా రోమాలను నిక్క బొడిచే విధంగా ఉంటుంది.

ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి . ఇప్పటి మాదిరిగానే ఇజ్రాయిల్.. ఇరాన్ మీద సంఘర్షణలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఇరాన్ న్యూక్లియర్ స్థావరాల మీద ఇజ్రాయిల్ పదేపదే దాడులు చేసింది. ఇరాన్ సుప్రీమ్ లీడర్ తో పాటు కీలకమైన నాయకులను చంపేసింది. దీంతో ఇజ్రాయిల్ సీక్రెట్ ఏజెన్సీ సంస్థ మొస్సాద్ మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ సంస్థ అమెరికా డీప్ స్టేట్ కంటే స్ట్రాంగ్ అని పలువురు చెబుతున్నారు. వాస్తవానికి ఇజ్రాయిల్ సీక్రెట్ ఆపరేషన్లు చేపట్టడంలో తోపు. కాకపోతే అందరూ చెబుతున్నంత తోపైతే కాదు. ఎందుకంటే ఆ సంస్థను వెంట్రుకముక్క కంటే హీనంగా తీసి పక్కన పడేసాడు ఓ వ్యక్తి. చివరికి చావును కూడా జయించి ఇజ్రాయిల్ దేశానికి షాక్ ఇచ్చాడు.

అది 1991.. గల్ఫ్ యుద్ధం జరిగింది. ప్రపంచం ఆ ప్రభావాన్ని ప్రత్యక్షంగా.. పరోక్షంగా చవిచూసింది. ముఖ్యంగా గల్ఫ్ దేశాల నీడ అంటేనే గిట్టని ఇజ్రాయిల్.. నాడు ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ను ప్రపంచ ముప్పుగా అభివర్ణించింది. చివరికి అతడిని అంతం చేయడానికి కూడా ప్రయత్నించింది. అనేక రకాల ప్రయత్నాలు కూడా చేసింది.. అయితే అవి విఫలమయ్యాయి. చివరికి “ఆపరేషన్ బ్రాంబుల్ బుష్” ను మొదలుపెట్టింది. నాడు ఇజ్రాయిల్ దళాలలో అత్యున్నతమైన కమాండో నయో రెట్ మత్కల్ ఈ పథకాన్ని అమలులో పెట్టాలని రంగం సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే నాడు సద్దాం హుస్సేన్ తన స్వస్థలమైన తిత్రిక్ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ తన అనుచరుల అంత్యక్రియలలో పాల్గొనేందుకు అతడు బయలుదేరాడు. ఇజ్రాయిల్ కమాండోలు అరబ్బుల వేషంలో కనిపించారు. సద్దాం కాన్వాయ్ మీద కాల్పులు జరపాలని ప్రణాళిక రూపొందించారు. సీక్రెట్ ఏజెన్సీ కూడా పటిష్టమైన సమాచారం ఇవ్వడంతో ఇజ్రాయిల్ మిల్ట్రీ ఈ ఆపరేషన్లో పాలుపంచుకునేందుకు ముందుకు వచ్చింది.

1992 నవంబర్ ఐదున మత్కల్ టీం సద్దాం హుస్సేన్ ను చంపడానికి రంగం సిద్ధం చేసింది. దానికంటే ముందు ప్రాక్టీస్ కూడా చేసింది. ఆ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మిస్సైల్ సిమ్యులేషన్ సమయంలో సొంత టీం మీద పడింది. దీంతో అత్యంత కీలకమైన ఐదుగురు కమాండోలు చనిపోయారు. మిగతా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో సద్దాం హుస్సేన్ ను చంపాలనలనే ప్రణాళిక ఆగిపోయింది. దీంతో సద్దాం హుస్సేన్ చావును జయించాడు. ఇజ్రాయిల్ దేశానికి చుక్కలు చూపించాడు.. దీనిని విదేశీ నిపుణులు తీలిమ్ బెట్ విపత్తు అని పిలుస్తుంటారు.. కమాండోలు మరణాలను చాలా సంవత్సరాల పాటు ఇజ్రాయిల్ ప్రపంచానికి తెలియకుండా దాచింది. దీనికంటే ముందు బ్రాంబుల్ బుష్ ఆపరేషన్ ను ఇజ్రాయిల్ శాశ్వతంగా రద్దు చేసింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version