Israel: భారత జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాలు.. అమెరికా, దక్షిణాప్రికా, రష్యా, ఇంగ్లండ్‌లో ఉన్న విజయం తెలిసిందే. శాంతియుతంగా ఆయన స్వాతంత్య్రం సాధించినందుకు గుర్తుగా ఈ విగ్రహాలను ఏర్పాటు చేశారు. అయితే ఓ భారతీయుడి విగ్రహం.. ఇస్లాం దేశం అయిన ఇజ్రాయెల్‌లో ఏర్పాటు చేశారు. నవాతిన్ నగరంలో ఇటీవల భారతీయ రాజవంశీయుడి విగ్రహం మానవతా చిహ్నంగా నిలిచింది. ఇంతకీ ఇతను ఎవరు.. విగ్రహం ఇజ్రాయెల్‌లో ఎందుకు ఏర్పాటు చేశారో తెలుసుకుందాం..
గుజరాత్‌లోని జామ్‌నగర్ మహారాజ దిగ్విజయ్‌సింగ్ జదేజా – రెండో ప్రపంచయుద్ధం సమయంలో బాధితులకు ఆశ్రయం కల్పించాడు. హిట్లర్ భయం నుంచి తప్పించుకుని పోలెండ్ నుంచి వచ్చిన యూదు విద్యార్థులకు తలదాచుకునే చోటు కల్పించాడు. 1940లలో యూరప్‌లో హిట్లర్ దురాగతాలు ఉద్ధృతంగా సాగుతున్నప్పుడు వేలాది యూదులు ప్రాణాలకు పరారయ్యారు. వారిని ఏ దేశం స్వీకరించడానికి ముందుకు రాలేదు. అప్పుడు భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉన్నా, జామ్‌నగర్ రాజు మానవతా విలువ ముందు రాజకీయాల్ని పక్కనబెట్టారు. 150కిపైగా చిన్నారులను తన ప్రావిన్స్‌లో తాత్కాలిక పాఠశాలల్లో చేరదీసి, పోలిష్ భాషా ఉపాధ్యాయులను నియమించి, వారికి అనుకూలమైన ఆహారం, దుస్తులు అందించారు.
బాబా సాహెబ్‌గా గుర్తింపు..
రాజా దిగ్విజయ్‌సింగ్ నిర్ణయంతో ‘బాబూ సాహెబ్’ అని ప్రేమగా పిలవబడిన జదేజా అంతర్జాతీయ స్థాయిలో మానవతా నాయుకుడిగా గుర్తింపు పొందారు. యుద్ధం ముగిసిన తరువాత ఆ విద్యార్థులు తమ స్వదేశాలకు తిరిగి వెళ్లినా, భారతదేశంపై తాము పొందిన సానుభూతిని తరాల పాటు మరిచిపోలేదు.
పోలండ్, ఇజ్రాయెల్ కృతజ్ఞత
పోలాండ్‌లోని బాల్టిక్ ప్రాంతానికి చెందిన యూదు సంఘాలు ఇప్పటికే ఆయన స్మారకార్థం ఒక వీధికి ‘బాబూ సాహెబ్ మార్గ్ అని పేరు పెట్టాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రభుత్వం కూడా అదే గుర్తింపును విస్తరించి నవాతిన్ నగరంలో ప్రతిమను ప్రతిష్టించింది. ఇది రాజకీయ గౌరవం మాత్రమే కాక, విలువల పరంగా భారతదేశం ఆ సమయాన చూపిన సహానుభూతి ప్రపంచానికి ఒక సంకేతం.
భారత మానవతా తాత్వికతకు ప్రతీక
జదేజా చర్య ఒక వ్యక్తి సాహసకృత్యంగా కనిపించినా, అది భారత సాంప్రదాయ ‘వసుధైవ కుటుంబకం‘ భావనకు సజీవ ఉదాహరణ. విపత్తులో ఉన్నవారిని స్వీకరించే ధోరణి, సంస్కృతికి మించిన బంధానికి పునాది వేసింది. ఈ నేటి ప్రపంచ రాజకీయాల్లో కూడా ఈ కథ అనుకూలత, సహజీవనానికి మార్గదర్శకంగా నిలుస్తుంది. ఈ స్మారక చర్య రెండు దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక అనుబంధాన్ని మరింత బలపరిచింది.