Homeఅంతర్జాతీయంDonald Trump Iran Ceasefire: యుద్ధానికి విరామం.. ఐదు రోజుల బ్రేక్‌తో ఏం జరుగుతుంది?

Donald Trump Iran Ceasefire: యుద్ధానికి విరామం.. ఐదు రోజుల బ్రేక్‌తో ఏం జరుగుతుంది?

Donald Trump Iran Ceasefire: ఇరాన్‌ అణ్వస్త్రాలు తయారు చేస్తందని, ఉగ్రవాదులను తయారు చేస్తుందని పశ్చిమాసియాలో అగ్గి రాజేసిన ట్రంప్‌ 23 రోజుల భీకర దాడుల తర్వాత దానిని ఆర్పే ప్రయత్నాలు కూడా ట్రంపే మొదలు పెట్టాడు. ఇరాన్‌తో రెండు రోజులుగా చర్చలు జరుపుతున్నామని, సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉండడంతో ఐదు రోజులు దాడులు నిలిపివేస్తున్నామని ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. ఎందుకంటే ఈ యుద్ధంతో ప్రపంచం మొత్తం ప్రభావితమైంది. ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. చమురు సంక్షోభం నెలకొంది. ఆమెరికా తీవ్రంగా నష్టపోయింది.

Also Read: మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత.. ఇంత దారుణమా.. అసలు వాళ్ళు ఏమైపోవాలి?

విరామ వెనుక రహస్యం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌పై దాడులను 5 రోజుల పాటు ఆపేస్తున్నట్లు ప్రకటించారు. ఇది 23 రోజులుగా కొనసాగుతున్న యుద్ధంలో తాత్కాలిక మలుపుగా కనిపిస్తోంది, అయితే ఇరాన్‌ చర్చలు జరగడం లేదని స్పష్టం చేసింది. ఈ ప్రకటన హార్మూజ్‌ జలసంధి ఓపెన్‌ చేయాలని 48 గంటల డెడ్‌లైన్‌తో ముడిపడి ఉంది.

ఆర్థిక సంక్షోభం..
యుద్ధం వల్ల క్రూడ్‌ ఆయిల్‌ ధరలు 60–70 డాలర్ల నుంచి 110–119 డాలర్లకు చేరాయి, ట్రంప్‌ ప్రకటన తర్వాత 100కి పడిపోయాయి. భారత్‌కు ఇది భారీ ఇబ్బంది, ఎందుకంటే ఇంధన దిగుమతులపై ఆధారపడి ఉంది, ద్రవ్యోల్బణం పెరిగి రూపాయి బలహీనపడుతోంది. విరామంతో ఆర్థిక వ్యవస్థలకు ఊపురావచ్చు, కానీ దీర్ఘకాలిక స్థిరత్వం లేకపోతే సమస్యలు కొనసాగవచ్చు.

అమెరికా లక్ష్యం రెజీమ్‌ చేంజ్‌..
అమెరికా ముఖ్యంగా ఇరాన్‌ అణు కార్యక్రమాన్ని ఆపాలని, క్షిపణులను విధ్వంసం చేయాలని కోరుతోంది. కీలక నేతలను లక్ష్యంగా చేసినా ఇరాన్‌ పాలన మారలేదు, ముజ్తబా ఖమేనీ సుప్రీం లీడర్‌గా కొనసాగుతున్నారు. ట్రంప్‌ యుద్ధాన్ని తగ్గించాలన్నా, పూర్తి సీజ్‌ఫైర్‌కు సిద్ధం కాదని చెప్పారు.

ఇరాన్‌ మూడు కీలక డిమాండ్లు..
ఇరాన్‌ యుద్ధం ఆపాలంటే సార్వభౌమత్వ గుర్తింపు, ఆర్థిక నష్టాలకు పరిహారం, భవిష్యత్‌ దాడులకు అంతర్జాతీయ హామీలు కావాలని మూడు షరతులు పెట్టింది. ఇవి అమెరికా లక్ష్యాలతో ప్రత్యర్థంగా ఉండటం వల్ల చర్చలు క్లిష్టంగా మారవచ్చు. ఇరాన్‌ గల్ఫ్‌ దేశాలపై దాడులతో అమెరికాను ఒత్తిడికి గురిచేస్తోంది.

యుద్ధం వల్ల గల్ఫ్‌ మార్గాలు మూసుకుపోయి విమానాలు ఆగాయి, ఇంధన సంక్షోభం తీవ్రమైంది. విరామంతో మార్గాలు తెరిచి ఆర్థిక కోలుకోవచ్చు, కానీ చమురు ధరలు స్థిరంగా ఉండకపోతే సబ్సిడీలు పెరిగి బడ్జెట్‌పై ఒత్తిడి పడుతుంది. దీర్ఘకాలంలో ఇరాన్‌–అమెరికా చర్చలు ఫలిస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News