Homeఅంతర్జాతీయంIran New Law Hormuz Strait Oil Crisis: హర్మూజ్‌పై ఇరాన్‌ కొత్త చట్టం.. ఇక...

Iran New Law Hormuz Strait Oil Crisis: హర్మూజ్‌పై ఇరాన్‌ కొత్త చట్టం.. ఇక శత్రు దేశాలకు షాక్‌!

Iran New Law Hormuz Strait Oil Crisis: ఇరాన్‌–అమెరికా మధ్య ఉద్రిక్తతలు హార్మూజ్‌ జలసంధిని కేంద్రంగా మరింత తీవ్రస్థితి చేరాయి. చర్చలు విఫలమై, ఇరాన్‌ జలసంధిపై కఠిన నియంత్రణలు ప్రకటించింది. ప్రపంచ చమురు సరఫరా దీనిపై ఆధారపడుతున్న నేపథ్యంలో ఆర్థిక ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇస్లామాబాద్‌లో 21 గంటల సుదీర్ఘ చర్చలు ఫలితం లేకుండా ముగిశాయి. అమెరికా అణు కార్యక్రమంపై 20 సంవత్సరాల ఫ్రీజ్, జలసంధి దిగ్బంధనాలు డిమాండ్‌ చేసింది. ఇరాన్‌ ఇజ్రాయెల్, అమెరికా ‘అర్థరహిత’ షరతులను తిరస్కరించి, యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని సవాల్‌ చేసింది. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ’ఇరాన్‌కు బ్యాడ్‌ న్యూస్‌’ అని హెచ్చరించారు. ఈ క్రమంలో ఇరాన్‌ శత్రుదేశాలకు షాక్‌ ఇచ్చేలా కొత్త చట్టం రూపొందిస్తోంది.

హార్మూజ్‌ లేటెస్ట్‌ స్థితి..
ఇరాన్‌ సంయుక్త సైనిక ఆదేశాలు జలసంధిని తమ పూర్తి నియంత్రణలో ఉంచుతూ, అమెరికా దిగ్బంధనాలు ఉన్నంతకాలం రవాణాను అడ్డుకుంటామని ప్రకటించాయి. గత 50 రోజుల్లో ఆంక్షలు విధించి, ఇటీవల తెరిచినా మళ్లీ మూసివేశారు. ప్రపంచ చమురు, గ్యాస్‌ రవాణాకు ఇది కీలయం. తాజా నిర్ణయంతో చమురు రవాణాకు బ్రేక్‌ పడింది.

ఇరాన్‌ కొత్త చట్ట వివరాలు
పార్లమెంటరీ సివిల్‌ ఇంజనీరింగ్‌ కమిటీ చైర్మన్‌ మహమ్మద్‌ రెజాయ్‌ కూచీ ప్రకటించిన ముసాయిదా తుది దశలో ఉంది. ఇజ్రాయెల్‌ సంబంధ నౌకలపై పూర్తి నిషేధం ఉంటుంది. హర్మూజ్‌ దాటాలంటే జాతీయ భద్రతా మండలి అనుమతి తీసుకోవాలి. యుద్ధం కారణంగా జరిగిన నష్టానికి పరిహారం చెల్లించకపోతే ప్రయాణానికి అనుమతి ఇవ్వరు. రవాణా రుసుము ఇరాన్‌ కరెన్సీలో మాత్రమే చెల్లించాలి. భద్రత ’ఉచితం కాదు’ అని ఉపాధ్యక్షుడు మహ్మద్‌ రెజా ఆరిఫ్‌ హెచ్చరించారు.

ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం..
ఇరాన్‌ నిర్ణయంతో చమురు ధరలు 100–120 డాలర్ల వరకు రికార్డు స్థాయిలు చేరాయి. హర్మూజ్‌ మూసివేతతో 20 శాతానికిపైగా పెరిగే అవకాశం ఉంది. గల్ఫ్‌ దేశాల నుంచి 40 శాతంపైగా చమురు దిగుమతి చేసుకునే భారత్‌ ఇప్పుడు ఆఫ్రికా, రష్యా నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుటటోంది. మరోవైపు పెట్రోల్‌–డీజిల్‌ ధరలు 15–90 శాతం పెరిగాయి. చైనా, యూరప్‌లో కూడా ఇంధన కొరత పెరుగుతోంది. మధ్యప్రాచ్య చమురుపై ఆధారపడి ఉన్న భారత్‌లో పెట్రో ఉత్పత్తుల ధరలు ఆకాశతాకుతాయి.

ఇరాన్‌ ప్రతీకార వ్యూహం ఆర్థిక ఆయుధంగా మారింది. చర్చలు ఆలస్యమైతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పు. భారత్‌ వంటి దేశాలు వైవిధ్యమైన మూలాలపై దృష్టి పెట్టాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular