Iran Missile Attack On Jerusalem: ఇరాన్, అమెరికా–ఇజ్రాయెల్ వార్ 22 రోజులైనా తీవ్రత తగ్గడం లేదు. ఇరాన్ సుప్రీం లీడర్‌ను కోల్పోయినా.. ఇతర కీలక నేతలు, అధికారులు యుద్ధంలో మరణించినా ఎక్కడా తగ్గడం లేదు. ఇజ్రాయెల్‌తోపాటు గల్ఫ్ దేశాలపై వైమానిక, డ్రోన్ దాడులతో విరుచుకుపడుతోంది. అమెరికాకు మద్దతుగా ఉన్నందుకు గల్ఫ్ దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు మరణించారని ఇరాన్ ప్రచారం చేస్తోంది. ఇలాంటి తరుణంలో ఇరాన్ చేసిన దాడిలో ఇజ్రాయెల్‌లోని జెరూసలెం వణికిపోయింది. అల్–అక్సా మసీదు సమీపంలో జరిగిన ఈ దాడి రంజాన్ పండుగ రోజు మసీదు మూతలకు దారితీసింది. వందలాది ముస్లింలు గేట్ల బయట ప్రార్థనలు చేయాల్సి వచ్చింది. ఇజ్రాయెల్ దీనిపై స్పందించింది. ఇరాన్‌ను మతపరమైన స్థలాలను లక్ష్యం చేస్తోందని ఆరోపించింది.
Also Read: అసెంబ్లీలో ‘గులాబీ’ ఫైట్: కెప్టెన్ కేసీఆర్ లేని గ్రౌండ్.. రేవంత్ ‘సిక్స్’ల పండగ!
జెరూసలెం దాడి ఇలా..
ఇరాన్ ప్రయోగించిన క్షిపణి జెరూసలెం పాత నగరంలోని పవిత్ర ప్రాంతంలో పడడంతో జనం భయాందోళనకు గురయ్యారు. ప్రాణ భయంతో పరుగులు తీశారు. ఈ దాడిలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ మూడు మతాలకు పవిత్రమైన ఈ ప్రదేశంలో రంజాన్ పండుగ రోజు మసీదు మూసివేయాల్సి వచ్చింది. 60 ఏళ్ల ఇజ్రాయెల్ చరిత్రలో తొలిసారి మసీదు మూతపడింది. పండుగ రోజు వందలాది ముస్లింలు ఆరుబయటే ప్రార్థనలు చేశారు.
హార్మూజ్‌పై పట్టు కోసం..
ఇదిలా ఉంటే ఆయిల్ సంక్షోభం నేపథ్యంలో హార్మూజ్ జలసంధి నుంచి రవాణాకు అనుమతులు ఇవ్వాలని అమెరికా వార్నింగ్ ఇచ్చింది. అమెరికా–ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ క్రూజ్ క్షిపణులు, ఆయుధ నిల్వలు ధ్వంసమయ్యాయి. హర్మూజ్ జలసంధి నియంత్రణ సామర్థ్యం తగ్గిపోయింది. అమెరికా సెంట్రల్ కమాండ్ 5 వేల పౌండ్ల బాంబులతో భూగర్భ కేంద్రాలను కూల్చింది. ఈ దాడిలో 21 వేల మంది గాయపడినట్లు ఇరాన్ తెలిపింది.
మతపరమైన ఉద్రిక్తతలు
రంజాన్ సమయంలో పవిత్ర మసీదు మూతలు ముస్లిం సమాజంలో కోపాన్ని రేకెత్తించాయి. ఇజ్రాయెల్ ఇరాన్‌ను మతపరమైన భావనలతో దాడి చేస్తోందని ఆరోపించగా, ఇరాన్ ప్రతీకార దాడులు మరింత పెరిగే అవకాశం. ఈ ఘటన పశ్చిమాసియా యుద్ధాన్ని మత సంఘర్షణగా మలుపు తిప్పుతోంది. ఇరాన్ సామర్థ్యం తగ్గినా ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు బలోపేతం చేస్తోంది.
