Iran internet shutdown: ఇరాన్, అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధం ఏడో రోజు కూడా భీకరంగా కొనసాగుతోంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్, గల్ప్ దేశాలు దాడి చేస్తున్నా ఇరాన్, లెబనాన్, సిరియాతో కలిసి ఇజ్రాయెల్, గల్ప్ దేశాలపై మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది. ఈ దాడులు ప్రస్తుతం 14 దేశాలకు విస్తరించాయి. మరోవైప అధికారికంగా 1500 మంది మరణించారు. ఇక లెక్కలేనంతగా ఆస్తులన నష్టం జరిగింది. యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశం కనిపించడం లేదు. ఈ క్రమంలో ఇరాన్ మరో తాంత్రిక వ్యూహం అమలు చేస్తోంది. ఇంటర్నెట్ ద్వారా సైబర్ దాడులు జరిగే ప్రమాదం ఉండడంతో దేశంలో ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిపివేసింది. సైబర్ దాడుల నుంచి సున్నితమైన సమాచారాన్ని కాపాడటానికి ఈ చర్య తీసుకున్నట్లు నిపుణులు అంచనా. యుద్ధ సమయంలో సైనిక కదలికలు, ఆయుధ స్థానాలు లీక్ కాకుండా చూడాలనే ఉద్దేశం.
సాంకేతిక విధానాలు
ఇరాన్ గ్లోబల్ నెట్‌వర్క్‌లను కట్ చేసి, దేశీయ ఇన్‌ట్రానెట్‌కు మార్చింది. ఫైర్‌వాల్‌లు, డీఎన్‌ఎస్ బ్లాకింగ్, ఐఎస్‌పీల అనుమతి ఆపివేతల ద్వారా 99% ట్రాఫిక్ ఆపింది. సైనిక సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు మాత్రమే పరిమిత యాక్సెస్ ఇచ్చారు. ఇది చైనా గ్రేట్ ఫైర్‌వాల్ మోడల్‌ను పోలి ఉంది.
ప్రజలపై ప్రభావం..
ఇంటర్నెట్ నిలిపివేతతో పౌరులు సమాచారం లేకుండా భయపడుతున్నారు. వార్తలు, సోషల్ మీడియా ఆగిపోయి. ఆర్థిక లావాదేవీలు, బ్యాంకింగ్, ఆన్‌లైన్ వాణిజ్యం ఆగిపోయాయి. వైద్య, ఆహార సరఫరాల్లో అంతరాయాలు తలెత్తాయి. యువత, నిరసనకారులు రోడ్లపై ఆందోళన చేస్తున్నారు.
అంతర్జాతీయ పరిణామాలు
ఈ చర్య అమెరికా, ఇజ్రాయెల్ సైబర్ ఆపరేషన్లకు బ్రేక్ వేసింది. అయితే ఐక్యరాష్ట్ర సమితి, హ్యూమన్ రైట్స్ సంస్థలు ఇంటర్నెట్ నిలిపివేతను తప్పు పట్టాయి. రష్యా, చైనా మద్దతుగా ఇరాన్‌కు ఆల్టర్నేటివ్ నెట్‌వర్క్‌లు స్థాపించవచ్చు, ఇది డిజిటల్ విభజనను పెంచుతుంది.