Homeఅంతర్జాతీయంIran Foreign Minister visit to India: భారత్ లో ఇరాన్ విదేశాంగ మంత్రి.. యుద్ధ...

Iran Foreign Minister visit to India: భారత్ లో ఇరాన్ విదేశాంగ మంత్రి.. యుద్ధ సంధిలో రాజకీయాల మలుపు

Iran Foreign Minister visit to India: అమెరికా-ఇరాన్ యుద్ధం ప్రస్తుతం హోల్డ్ లో ఉంది. కానీ ఉద్రిక్తతలు మాత్రం కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ భారత్‌కు చేరుకున్నారు. బ్రిక్స్ సదస్సు పేరుతో జరిగిన ఈ తొలి అధికారిక పర్యటన దౌత్య పరంగా ప్రత్యేకమైనది. హర్మూజ్ జలసంధి ద్వారా భారత ఇంధన సరఫరాకు ఆటంకాలు ఎదురవుతున్న సమయంలో ఈ పర్యటన రక్షణాత్మక మలుపుగా మారింది. భారత్ తన ఆర్థిక, భద్రతా ప్రయోజనాలను కాపాడుకునే అవకాశాన్ని సృష్టించుకుంది.

బ్రిక్స్ వేదికపై ఇరాన్ గొంతుక..
బ్రిక్స్ ఆఫీషియల్స్ మీటింగ్ మే 14న(గురువారం), న్యూ ఢిల్లీలో జరుగుతుంది. ఇందులో ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చీ పాల్గొనడం ప్రపంచ ఉద్రిక్తతల్లో ఇరాన్ స్థానాన్ని బలపరుస్తుంది. బ్రిక్స్ లో సభ్య దేశాలు భారత్, రష్యా, చైనా మొత్తం 45 శాతం, ప్రపంచ జనాభా 30 శాతం జీడీపీ కలిగి ఉన్నాయి. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇది ఇరాన్‌కు మొదటి అంతర్జాతీయ వేదిక. భారత్ మీడియేటర్‌గా నిలబడి, పర్షియన్ గల్ఫ్ స్థిరత్వానికి దోహదపడగలదు.

కీలక చర్చల అవకాశాలు..
హర్మూజ్ గుండా 20 శాతం చమురు, 25 శాతం ఎల్ ఎన్ జీ సరఫరా జరుగుతుంది. ఇందులో భారత్‌కు 50 శాతం ఎల్ పీ జీ, 30 శాతం చమురు ఈ మార్గం గుండా జరుగుతుంది. యుద్ధం కారణంగా ఎల్ పీ జీ ధరలు 15% పెరిగి, గృహ ఇంధన ఖర్చు రూ.1000 కోట్లు పెరిగింది. అరాఘ్చీతో కేంద్రం నౌకల సురక్షిత రవాణా, రూట్ క్లియరెన్స్‌పై చర్చించే అవకాశం ఉంది.

ద్వైపాక్షిక లాభాలు..
ఈ సందర్శన చాబర్ హార్ట్ పోర్టు, ఐ ఎన్ ఎస్ టి సీ కారిడార్‌ను ముందుకు తీసుకెళ్తుంది. భారత నౌకాదళం ఇప్పటికే 5 షిప్ ఎస్కార్ట్‌లు చేసింది. అయితే, అమెరికా ఒత్తిడి సవాల్ గా మారింది. అరాఘ్చీ పర్యటన భారత్‌ను బలపరుస్తుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version