Iran Drone Army In Hormuz Strait: ఇరాన్, అమెరికా– ఇజ్రాయెల్ వార్ 15 రోజులైనా ఉధృతి తగ్గడం లేదు. అమెరికా–ఇజ్రాయెల్‌కు అనేక దేశాలు మద్దతుగా ఉన్నాయి. నాటో కూటమి కూడా యుద్ధరంగంలోకి దిగింది. ఇక ఇరాన్ మాత్రం ఒంటరిగా పోరాడుతోంది. ఇరాన్ మరోవైపు ఆర్మూజ్ జల సంధిని మూసివేసి ప్రపంచ వ్యాప్తంగా చమురు రవాణాను స్తంభింపజేసింది. ఇప్పటికే అనేక దేశాలు చమురు కొరతతో ఇబ్బంది పడుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై సైన్యం మోహరించాలని పిలుపునిచ్చారు. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా కీలక ప్రకటన చేసింది. ఈమేరకు టీవీ ఛానల్‌లో ఓ వీడియో విడుదల చేసింది. పొడవాటి అండర్‌గ్రౌండ్ టన్నెల్స్‌లో ఒకదాని వెంట ఒకటిగా ఉంచిన సూసైడ్ డ్రోన్ బోట్లు, యాంటీ–షిప్ మిస్సైళ్లు, సముద్ర మైన్స్ కనిపించాయి. ఆయుధాలు విడుదల చేసే దృశ్యాలు కూడా ఉన్నాయి. ఇవి అమెరికా–ఇజ్రాయెల్ దాడుల తర్వాత లేక ముందుగానే తీశాయా అనేది స్పష్టం కాలేదు. కానీ టైమింగ్ శత్రువులను ఆందోళనకు గురిచేస్తోంది.
మానవ రహిత బోట్లు..
ఈ డ్రోన్ బోట్లను అన్‌మ్యాన్డ్ సర్ఫేస్ వెహికల్స్ అంటారు. పేలుడు పదార్థాలతో నిండినవి. జల ఉపరితలం లేదా కొంచెం కింద ప్రయాణిస్తాయి. శత్రు నౌకలు, ట్యాంకర్లను తాకి పేలడమే లక్ష్యం. పర్షియన్ గల్ఫ్‌లో ఇప్పటికే రెండు ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ వాటిని వాడి దాడి చేసింది. హార్మూజ్ వంటి సన్నని మార్గాల్లో ఇవి భారీ నష్టం కలిగిస్తాయి.
చమురు రవాణా స్తంభన
ప్రపంచ చమురు సరఫరాలో 20% హార్మూజ్ గుండా పోతుంది. ఈ డ్రోన్ ఆర్మీతో ఇరాన్ రవాణాను పూర్తిగా ఆపేస్తే గ్లోబల్ ఆర్థిక సంక్షోభం విరబోస్తుంది. అమెరికా, ఇజ్రాయెల్‌కు మాత్రమే కాకుండా గల్ఫ్ దేశాలు, యూరప్, ఆసియా దేశాలకు ఇది షాక్. ఇరాన్ ఇలాంటి ఆయుధాలను ఉక్రెయిన్‌లో హౌతీలు వాడిన మోడల్ నుంచి పరిశీలించి మెరుగుపరిచింది.
ఇరాన్ విడుదల చేసిన వీడియో ప్రచారం ఇరాన్ సైనిక సన్నద్ధతను ప్రదర్శిస్తూ శత్రువులపై మానసిక ఒత్తిడి పెంచుతోంది. భారత్ వంటి దేశాలు దౌత్యంతో తమ నౌకలను కాపాడుకున్నా, దీర్ఘకాలంలో చమురు ధరలు బాంబులా పేలతాయి. అమెరికా సైనిక చర్యలు తీవ్రతరం అయితే సముద్ర యుద్ధం మొదలవుతుంది.