Iran Vs America: వెనుజువెలా అధ్యక్షుడు నికోలస్ ముదురోను కిడ్నాప్ చేసిన తర్వాత అమెరికా అధ్యక్ష డొనాల్డ్ ట్రంప్‌కు అహంకారం తలకెక్కింది. ఇక ఏ దేశంలో అయినా తాము చొరబడగలమన్న గర్వం కనిపిస్తోంది. ఈ క్రమంలోనే తర్వాతి టార్గెట్ ఇరాన్‌ను ఎంచుకున్నాడు. ఇరాన్‌పై సైనిక చర్యలు ప్రణాళికట్టుతున్నారనే ప్రచారాలు వ్యాప్తి చెందుతున్నాయి. కానీ ఇరాన్‌ను టచ్ చేస్తే.. అమెరికా మాత్రమే కాక, ప్రపంచానికి పెను ప్రమాదం తప్పదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఇరాన్‌కు బలమైన సైనిక శక్తి..
ఇరాన్ అధునాతన క్షిపణులు, డ్రోన్ దళాలతో సిద్ధంగా ఉంది. అమెరికా దాడి జరిగితే హోర్ముజ్ జలసంధి మూసివేయడం ద్వారా ప్రపంచ చమురు సరఫరా 25% తగ్గుతుంది. పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకే పరిస్థితి ఏర్పడవచ్చు, ఆర్థిక అస్థిరతలు వ్యాప్తి చెందుతాయి.
ఇజ్రాయెల్‌కు రహస్య ముప్పు
హూతీలు, హిజ్‌బుల్లా, ఇరాక్ మిలిటెంట్లు అమెరికా–ఇజ్రాయెల్ లక్ష్యాలపై తిరుగుబాటు చేస్తారు. రష్యా, చైనా నేరుగా ఫైట్ చేయకపోయినా, ఇరాన్‌కు సాంకేతిక–దౌత్య సహాయం అందిస్తాయి. ఏకపక్ష చర్యలు అంతర్జాతీయ మిత్రులను శత్రువులుగా మారుస్తాయి.
గ్రీన్‌ల్యాండ్ స్వాధీనంతో నాటోలో చీలిక..
ఇక ట్రంప్ గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ పదే పదే ప్రకటిస్తున్నారు. ఈమేరకు డెన్మార్క్‌పై ఒత్తిడి తీస్తున్నారు. అయితే నాటో దేశం అయిన డెన్‌మార్కను టచ్ చేస్తే నాటో మిత్రదేశాలు అమెరికాకు దూరమయ్యే ప్రమాదం ఉంది. మధ్యప్రాచ్య యుద్ధ మేఘాలు ప్రపంచ దేశాల్లో మార్పులు రావొచ్చు.
ఇరాన్‌లో ఇంటర్నల్ అసంతృప్తి ఉన్నప్పటికీ, విదేశీ దాడి ప్రభుత్వానికి ప్రజా మద్దతు తెచ్చిపెడుతుంది. ట్రంప్ ఈ పరిణామాలు అర్థం చేసుకునే ముందు పరిస్థితులు తీవ్రమవుతాయి, ప్రపంచ సమీకరణాలు పూర్తిగా మారవచ్చు.