Xiaomi 15T PRO: నేటి కాలంలో యూజర్లు స్మార్ట్ ఫోన్ల విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. ధర తమ బడ్జెట్లో ఉండాలని.. ఫీచర్లు అన్లిమిటెడ్ గా ఉండాలని భావిస్తున్నారు. యూజర్ల మనస్తత్వం ఇలా మారడంతో కంపెనీలు కూడా తాము తయారు చేసే మోడల్స్ లో అద్భుతమైన ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.
ఇండియన్ మార్కెట్లో xiaomi కంపెనీకి మంచి పేరే ఉంది. ఈ కంపెనీ ప్రతి ఏడాది కొత్త కొత్త మోడల్స్ ను మార్కెట్లోకి తీసుకొస్తుంది. ఈ ఏడాది xiaomi 15 T Pro ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఫీచర్ల విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదని.. యూజర్లకు దిమ్మ తిరిగిపోయే స్మార్ట్ ఫోన్ అనుభవం లభిస్తుందని xiaomi కంపెనీ బలగుద్ది మరీ చెబుతోంది.
ఈ మోడల్ లో DXO MARK ద్వారా కెమెరా పని తీరును పరీక్షించారు. అందులో నూటికి నూరు శాతం పాజిటివ్ రిపోర్ట్ రావడంతో ఈ మోడల్ కు కెమెరా అను సెట్ అప్ చేశారు. ఈ మోడల్ లో 50 మెగా పిక్సెల్, అల్ట్రావైడ్ 12 మెగాపిక్సల్ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. ఆప్టికల్ జూమ్ సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చామని xiaomi కంపెనీ చెబుతోంది.
కెమెరాలో Leica ఆప్టిక్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ కెమెరాల ద్వారా కంప్యూటేషనల్ ఫోటోగ్రఫీ అనుభవాన్ని ఆస్వాదించవచ్చు. త్రిబుల్ కెమెరా హై లెవెల్ కాన్ఫిగరేషన్ ను అందిస్తుంది. ఆప్టికల్ జూమ్ ద్వారా విస్తృతమైన ఫోటోగ్రాఫిక్ అనుభవాన్ని ఆస్వాదించవచ్చు. టార్గటింగ్ ఎక్స్ పోజర్, ఆప్టికల్ జూమ్ విషయంలో ఈ కెమెరాలు తిరుగులేని స్థాయిలో పనిచేస్తాయని xiaomi కంపెనీ చెబుతోంది. డైనమిక్ పరిధిని పెంచడంలో సెన్సార్లు విస్తృతంగా పనిచేస్తాయి.
కెమెరా మాత్రమే కాకుండా, బ్యాటరీ కూడా బాహుబలి మాదిరిగా పనిచేస్తుందని xiaomi కంపెనీ చెబుతోంది. దీని ధర కూడా బడ్జెట్ రేంజ్ లోనే ఉంటుందని కంపెనీ వెల్లడిస్తోంది. జన్ జడ్ తరాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మోడల్ రూపొందించినట్టు xiaomi కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. తాము రూపొందించిన ఇతర మోడల్స్ కంటే, కెమెరా పరంగా, బ్యాటరీ పరంగా, సాఫ్ట్ వేర్ పరంగా ఈ మోడల్ అత్యంత విశ్వసనీయంగా ఉంటుందని xiaomi కంపెనీ చెబుతోంది. అన్ని ఆఫ్లైన్ స్టోర్లలో, ఈ కామర్స్ సైట్లలో ఈ మోడల్ అందుబాటులో ఉంటుందని xiaomi కంపెనీ చెబుతోంది.