Russia Internet Restrictions: మంది ఎక్కువైతే మజ్జిగ పలుచనా అంటారు. కానీ నేటి కాలంలో మాత్రం మజ్జిగ ఎలా ఉన్నా పర్వాలేదు.. మంది మాత్రం ఎక్కువ ఉండాలని అనుకుంటున్నారు. రాష్ట్రాల నుంచి మొదలుపెడితే దేశాల వరకు అన్ని మందిని పెంచే విధానాలను అమలు చేస్తున్నాయి. ఇందులో రష్యా కూడా ఒకటి.
ఒకప్పుడు ప్రపంచ దేశాలకు అధినేతగా… ప్రపంచానికి పెద్దన్నగా ఉండేది రష్యా. ఆ తర్వాత అమెరికా అనేక రకాలుగా కుట్రలు చేసింది. చైనా, ఇతర దేశాల సహాయంతో రష్యా ఆధిపత్యానికి గండి కొట్టింది. ఆ తర్వాత తను ప్రపంచ శక్తిగా ఎదిగింది. దశాబ్దాలకాలంగా ప్రపంచం మీద పెత్తనం సాగించడం మొదలుపెట్టింది. అయితే ఇంతటి సుదీర్ఘకాలంలో ఎన్నడు కూడా రష్యా అమెరికాకు తలవంచలేదు. వెన్ను అసలు చూపించలేదు. అయితే ఇప్పుడు రష్యాకు ఒక కొత్త సంక్షోభం ఇబ్బంది పెడుతోంది. దీంతో అక్కడి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
రష్యా కొంతకాలంగా ఉక్రెయిన్ దేశంతో యుద్ధం చేస్తోంది. రష్యా ఒంటరిగానే ఈ యుద్ధం చేస్తున్నప్పటికీ.. ఉక్రెయిన్ కు అమెరికా, యూరోపియన్ యూనియన్ సపోర్ట్ గా ఉంది. ఈ నేపథ్యంలోనే యుద్ధం చాలాకాలంగా సాగుతోంది. ఎట్టి పరిస్థితిలోనూ ఓటమిని ఒక్కోకూడదని రష్యా దూకుడుగా దాడులు చేస్తోంది. అత్యంత ఆధునికమైన సామగ్రితో యుద్ధం చేస్తోంది. యుద్ధం, ఇతర వ్యవహారాలను కాస్త పక్కన పెడితే.. రష్యా జనాభా సంక్షోభంతో తీవ్రంగా ఇబ్బంది పడుతోంది.. జనాభా గనక ఇదే స్థాయిలో తగ్గితే.. ఆ పరిణామాలు అన్ని రంగాల మీద పడతాయని రష్యా ఆందోళన వ్యక్తం చేస్తోంది.
జనాభా పెరుగుదల కోసం రష్యా వినూత్నమైన విధానాలను అమలు చేయడం మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే రాత్రిపూట ఇంటర్నెట్ వాడకంపై ఆంక్షలు విధించింది. ఎలక్ట్రిసిటీ వాడకంపై కూడా నిబంధనలు విధించింది. పెళ్లయిన దంపతులు రాత్రి తర్వాత ఇంటర్నెట్, ఎలక్ట్రిసిటీ వాడకూడదని సూచించింది. ఆ దంపతులు ఏదైనా ప్రైవేట్ లేదా ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తే రాత్రిపూట విధుల బాధ్యత అప్పగించకూడదని ఒక సర్కులర్ కూడా విడుదల చేసింది.. దీనివల్ల దంపతుల మధ్య బలమైన బంధం ఏర్పడుతుందని.. తద్వారా వారు పిల్లలకు జన్మనిస్తారని రష్యా ఆశాభావం వ్యక్తం చేస్తోంది. కేవలం రష్యా మాత్రమే కాదు, దక్షిణ కొరియా, జపాన్ దేశాలు కూడా జనాభా సంక్షోభం తో ఇబ్బంది పడుతున్నాయి.. జనాభా పెరుగుదల కోసం ఆయా దేశాలు వినూత్నమైన విధానాలను అమలు చేస్తున్నాయి.