Putin Security: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఉక్రెయిన్ యుద్ధంతో ఆయన పరిమిత దేశాల్లో పర్యటిస్తున్నారు. మూడేళ్లలో ఆయన చైనా, తజకిస్తాన్, కజకిస్తాన్, అమెరికా ఇలా పరిమిత దేశాల్లో పర్యటించారు. తాజాగా భారత్‌కు రాబోతున్నారు. అయితే పుతిన్ విదేశీ పర్యటనల్లో భారత భద్రతా ఏర్పాట్లతోపాటు రష్యన్ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. విదేశాల్లో ఆయన శారీరక నమూనాలను సూట్‌కేసుల్లో సేకరించి రష్యాకు తీసుకెళతారు. బాత్రూమ్లో కూడా అనుక్షణం రక్షకులు ఉంటారు.
బాడీగార్డ్ ఎంపిక ప్రక్రియ..
పుతిన్ రక్షకులు 5.8–6.2 అడుగుల ఎత్తు, 75–90 కేజీల బరువు, విదేశీ భాషా పరిజ్ఞానం ఉన్నవారే ఎంపిక కలుగుతారు. కఠిన శిక్షణ అనంతరం 35 సంవత్సరాల వయస్సులో రిటైర్మెంట్ తప్పనిసరి. ఉన్నత నేతలను కూడా అడ్డుకునే అధికారం వారికి ఉంటుంది.
డబుల్స్, వాహన భద్రత
ప్రమాదకర సందర్భాల్లో ముగ్గురు బాడీ డబుల్స్‌ను ఉపయోగిస్తారు, వీరికి ప్లాస్టిక్ సర్జరీలు చేయించినట్లు ఆరోపణలు. ప్రయాణానికి రస్ మోటార్స్ ఆరస్ సెనాట్ బుల్లెట్ ప్రూఫ్ కార్ వాడతారు, గ్రెనేడ్ దాడులు, పంక్చర్ టైర్లు తట్టుకునే సామర్థ్యం ఉంది.
ఆహారం, వాసపరిస్థితులు
విషపరీక్షల కోసం వ్యక్తిగత ల్యాబ్, రష్యన్ చెఫ్‌లు, హౌస్‌కీపింగ్ సిబ్బంది వెంట ప్రయాణిస్తారు. హోటల్ సిబ్బందిని నివారిస్తారు. పర్యటన స్థలాలు 30 రోజుల ముందు స్కాన్ చేస్తారు. ఇల్యుషిన్ ఐఎల్–96 విమానంలో జిమ్, బార్, వైద్య కేంద్రాలు, బ్యాకప్ జెట్ సౌకర్యాలు ఉంటాయి.