PM Modi: ఎన్నికల సమయంలో గెలవడానికి హామీలు ఇవ్వడం.. గెలిచినాక నిధులు లేవనే సాకుతో తప్పించుకోవడం ఇటీవల సాధారణం అయింది. తాజాగా కేరళ, తెలంగాణలో కాంగ్రెస్ నేతలు సూపర్ 5, సూపర్ 6 పేరుతో హామీలు ఇచ్చాయి. ప్రజలు కూడా వాటిని నమ్మి ఓటు వేశారు. కానీ అధికారంలోకి వచ్చాక.. హామీలు అమలు చేయడం లేదు. అయితే కాంగ్రెస్ పార్టీనే కాదు.. బీజేపీ కూడా ఇలాగే చేస్తోంది. స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ తన హామీ అమలు చేయడం లేదు. ఇప్పటికీ ప్రజలను భయపెడుతూనే ఉన్నారు. మోడీ పాలనలో లీటరు పెట్రోల్ ధరలు రూ.100 మార్కును దాటడం అరుదైన రికార్డుగా నిలిచింది. ఫిబ్రవరి 17న రాజస్థాన్ శ్రీగంగానగర్‌లో మొదటిసారి ఈ స్థాయి చేరుకున్న తర్వాత, ముంబై, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతాలో కూడా అదే సంవత్సరం జులైలో రూ.100ను తాకింది. రూ.75 నుంచి రూ.90 వరకు 2 సంవత్సరాల 9 నెలలు, రూ.90 నుంచి రూ.100 వరకు 13 నెలలు మాత్రమే పట్టడం గమనార్హం.
రూపాయి ఎఫెక్ట్…
తాజాగా డాలర్‌తో రూపాయి మారకం 2008 ప్రపంచ సంక్షోభంలో మొదటిసారి రూ.50ను దాటింది. 2012లో స్థిరంగా ఆ స్థాయి మించి, కోవిడ్‌తో 2020 మార్చిలో రూ.75కు చేరింది. రూ.50 నుంచి రూ.75 వరకు పదేళ్లు, రూ.75 నుంచి రూ.90 వరకు 5 సంవత్సరాలు పట్టింది. తాజాగా రూ.90 ఆల్‌టైమ్ లోవర్ నమోదైంది.
ధర తగ్గినా అమలు చేయని మోదీ..
క్రూడ్ ధరలు తక్కువగా ఉన్నా మోదీ దేశంలో పెట్రోల్ ధరలు తగ్గించడం లేదు. రాష్ట్రాల వ్యాట్ పన్నులు ప్రధాన కారణాలు. తాజాగా రూపాయి మరింత పడిపోకుండా ఆర్‌బీఐ చర్యలు కీలకంగా మారాయి. నిపుణులు 2026లో రూ.92, రూ.100కు 2030 వరకు సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రధాని మోదీ కూడా ఇదే విషయంపై ప్రజలను భయపెడుతున్నారు.
డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.100 మార్కును చేరుకుంటుందా? ఆ పరిస్థితి ఎప్పటికి ఏర్పడుతుందన్న ఆలోచనలు మొదలవుతాయి. అయితే.. రూ.90 మార్కును టచ్ చేసిన వేళ.. రూపాయి మరింత బక్కచిక్కకుండా ఉండేందుకు ఆర్ బీఐ చర్యలు తీసుకోవటంతోపాటు.. వేగంగా పడిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకునే వీలుంది.