Brown And Stanford University: విద్య మనిషి జీవితాన్ని మార్చేస్తుంది. అట్టడుగునా ఉన్న వారిని అత్యున్నత స్థాయికి చేరుస్తుంది. ఒకప్పుడు చదువు అంటే దూరం అయిన వారు ఇప్పుడు విద్య కోసం విదేశాలకు సైతం వెళ్తున్నారు. అయితే కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నచోట కాకుండా వేరే ప్రదేశాల్లో ఉంచి విద్యను అందిస్తున్నారు. కానీ అత్యున్నత కుటుంబాలకు చెందిన ముకేశ్ అంబానీ, అదాని వంటి కుటుంబీకులు తమ పిల్లలను విదేశాల్లో Stan University, Brown వంటి పాఠశాలలో చదివిస్తూ ఉంటారు. అయితే వారు డబ్బు ఉన్న వారు కాబట్టి ఈ యూనివర్సిటీలో చదివిస్తున్నారని.. లేదా ఇక్కడ నాణ్యమైన ప్రొఫెసర్లు ఉంటారని.. లేదా అత్యున్నత సౌకర్యాలు ఉంటాయని అనుకుంటారు. కానీ అంతకుమించి మరో కారణం కూడా ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ యూనివర్సిటీలో చేరాలంటే కేవలం డబ్బు ఉంటే మాత్రమే సరిపోదు. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కూడా చెక్ చేస్తారు. అంతేకాకుండా అంతకుముందు వారి ఫ్యామిలీ ఎలా ఉండేదో కూడా గమనిస్తారు. కేవలం బిలియనీర్స్ కుటుంబానికి చెందినవారు మాత్రమే ఇక్కడ ప్రవేశానికి అర్హులు. అయితే చాలామంది ఇక్కడ ఉత్సాహంగా చేరడానికి ప్రధాన కారణం వేరే ఉంది. ఇక్కడ పెద్దపెద్ద వ్యాపారవేత్తలకు చెందిన కుమారులు, టాప్ పొజిషన్లో ఉన్న రాజకీయ నాయకుల పిల్లలు, ప్రపంచంలో అత్యున్నత స్థాయిలో ఉన్న వారి పిల్లలు మాత్రమే చదువుతూ ఉంటారు. వీరికి ఇక్కడ ఉన్న ప్రొఫెసర్లు అత్యున్నత విద్యను అందిస్తారు. ఒక వ్యక్తి జీవితంలో ఎంతటి కష్టాన్ని అయినా ఎదుర్కోవడానికి చదువుతోపాటు అనేక రకాల శిక్షణను అందిస్తారు. గుర్రపు స్వారీ, యుద్ధ నైపుణ్యం వంటి విద్యలతో పాటు మానసిక దృఢత్వానికి అవసరమయ్యే స్కిల్స్ అందిస్తారు. ఇక్కడ ఉండే ప్రొఫెసర్లు ప్రత్యేక రంగంలో నిష్ణానుతులు అయి ఉంటారు. ఈ స్కూల్లో చదివితే ఇక వారి జీవితానికి ఎలాంటి తిరుగు ఉండదు.
అంతేకాకుండా మరో ప్రధాన కారణం కూడా ఉంది. ఇక్కడ చదువుకున్న వారు పెద్దపెద్ద ధనవంతులతో స్నేహం చేస్తారు. మీరు స్నేహితులై ఆ తర్వాత వ్యాపార వేత్తలుగా లేదా రాజకీయ నాయకులుగా మారి ఒకరికొకరు వ్యాపారం చేస్తూ ముందుకు వెళ్తారు. ఒకరి ఐడియాలను మరొకరు పంచుకుంటూ ఒక దేశ అభివృద్ధికి పాటుపడతారు. అంతేకాకుండా ప్రపంచంలో ఉన్న కొన్ని సమస్యలను పరిష్కరించేందుకు ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటారు. ఈ విధంగా టాప్ పొజిషన్లో ఉన్నవారు ఒక్కచోట చదివిన వారు అత్యున్నత రంగాల్లో రాణిస్తారు.
అయితే వీరు మాత్రమే కాకుండా మిగతా యూనివర్సిటీలో చదివిన వారు సైతం ఈ విధంగా ముందుగా స్నేహితులుగా మారి ఆ తర్వాత వ్యాపారం లేదా ఇతర రంగాల్లో రాణిస్తూ ఒకరికి ఒకరు కలిసి ఉంటారు. అందుకే విద్య అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం అని అంటారు. అయితే ఇతరులను చూసి టాప్ స్కూల్లో చేర్పించాలని అనుకోకుండా వారి స్తోమతను బట్టి మంచి పాఠశాలలో చదివించినా కూడా వారు రాణించే అవకాశాలు ఉంటాయి. అయితే వారికి చదువుతోపాటు జీవిత పాఠాలు కూడా నేర్పాల్సిన అవసరం ఉంది.