India EU trade deal: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు. తన ఏడాది పాలనలో ప్రపంచ దేశాలపై టారిఫ్‌లు విధిస్తూ కాలం వెల్లదీశాడు. మిత్రులు, శత్రువు అనే తేడా లేకుండా 5 నుంచి 200 శాతం వరకు టారిఫ్‌లు విధించారు. దీంతో ప్రపంచంలో చాలా దేశాలు ఈ టారిఫ్‌ల కారణంగా ఇబ్బంది పడుతున్నాయి. చాలా మంది ఉపాధి కోల్పోయారు. భారత్‌పై 50 శాతం సుంకాలు విధించారు. దీంతో చాలా కంపెనీలు ఉత్పత్తి తగ్గించాయి. ఉద్యోగులను తగ్గించాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఆస్ట్రేలియా, యూకే, సౌత్ ఆప్రికాతోపాటు అనేక చిన్న దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నారు. తాజాగా అమెరికాకు సన్నిహితంగా ఉండే యురోపియన్ యూనియన్‌ను మోదీ తన బుట్టలో వేసుకున్నాడు. అమెరికా అధ్యక్షుడు మాటను లెక్క చేయకుండా ఈయూ భారత్‌తో అతిపెద్ద వాణిజ్య ఒప్పందానికి సిద్ధమైంది. భారత్–యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌ఏటీ) ద్వారా లక్షలాది మందికి పెద్ద అవకాశాలు లభిస్తాయని నరేంద్రమోదీ ప్రకటించారు. ఇది అంతర్జాతీయ వ్యాపారంలో మూడింట ఒక భాగాన్ని కలిగి ఉంటుందని వివరించారు. ఇండియా ఎనర్జీ వీక్ (ఐఈడబ్ల్యూ) నాల్గవ సంప్రదింపు ప్రారంభ సమావేశంలో మాట్లాడుతూ, దేశంలో ఇంధన రంగంలో డిమాండ్ ఊపందుకుంటోందని, ఈ ఒప్పందం ద్వారా పెద్ద స్థాయి పెట్టుబడులు ఆకర్షిస్తామని చెప్పారు. ఇది ఉమ్మడి ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేస్తూ, ఉద్యోగాలు, వ్యాపార అవకాశాలను పెంచుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కుళ్లుకుంటున్న అమెరికా..
వాస్తవానికి అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఎప్పుడో జరగాల్సింది. కానీ అమెరికా కోసం మన దేశ రైతులను పణంగా పెట్టేందుకు మోదీ అంగీకరించడం లేదు. అనేక అంశాల్లో ఏకాభిప్రాయం రావడం లేదు. దీంతో వాణిజ్య చర్చలు నెలల తరబడి సాగుతున్నాయి. దీంతో భారత్‌పై టారిఫ్‌ల ప్రభావం తగ్గించేందు మోదీ ఒక అడుగు ముందుకు వేసి ప్రపంచ దేశాలతో చర్చలు ప్రారంభించారు. ఒప్పందాలూ చేసుకుంటున్నారు. భారత్–ఈయూ ఒప్పందం కూడా ఇందులో భాగమే. అయితే దీనిని చూసి ఇప్పుడు అమెరికా కుళ్లుకుంటోంది. యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్, తమ దేశం రష్యా–ఉక్రెయిన్ సంఘర్షణను అరికట్టేందుకు ఎక్కువ రాజీలు చేసుకున్నామని, భారత్‌పై చమురు దిగుమతులకు అదనపు పన్నులు విధించామని గుర్తు చేశారు. అయినా ఈయూతో భారత్ సులభంగా ఒప్పందం కుదుర్చుకుందని విమర్శించార. తమ సహకారానికి తగిన గుర్తింపు లభించలేదని ఆక్షేపించారు. ఇది అంతర్జాతీయ వాణిజ్యంలో దేశాల మధ్య పోటీతత్వాన్ని, భౌగోళిక రాజకీయాల ప్రభావాన్ని సూచిస్తోంది.
ప్రపంచ వ్యాపారంపై ప్రభావం.
ఈ ఒప్పందం ఈయూ– భారత్‌కు యూరప్ మార్కెట్లలో సులభ ప్రవేశం అందిస్తూ, ఎక్స్‌పోర్ట్‌లను పెంచుతుంది. ఇంధన, ఆటో, టెక్ రంగాల్లో పెట్టుబడులు పెరిగి, ఆర్థిక వేగాన్ని పెంచవచ్చు. అయితే, అమెరికా విమర్శలు భవిష్యత్ వాణిజ్య ఒప్పందాల్లో టెన్షన్లను సృష్టించవచ్చు. రష్యా చమురు విషయంలో భారత్ స్వతంత్ర విధానం కొనసాగితే, యూఎస్‌తో సంబంధాలు బలపడే అవకాశం ఉంది. మొత్తంగా, ఈ డెవలప్‌మెంట్ భారత్ గ్లోబల్ ఆర్థిక శక్తిగా ఎదగడానికి సహాయపడుతుంది, ఇతర దేశాలు కూడా భారత్‌వైపు చూసేలా చేస్తుంది.