Pem Wang Thongdok: అరుణాచల్‌ప్రదేశ్.. భారత దేశ ఈశాన్య రాష్ట్రం. ఈ రాష్ట్రంపై చైనా ఎప్పుడూ అక్కసు వెళ్లగక్కుతోంది. వివిధ రకాల మ్యాప్‌లు విడుదల చేస్తూ.. అరుణాచల్‌ప్రదేశ్‌లోని భూమిని తమదిగా చూపుతోంది. 2020లో గల్వాన్‌లో భారత భూభాగంలోకి చైనా సైనికులు రావడంతో భారత సైనికులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువైపులా సైనికులు మరణించారు. దీంతో చైనా భారత్ సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇటీవలే మళ్లీ ఇరు దేశాలు దగ్గరవుతున్నాయి. ఈతరుణంలో చైనా మరోసారి తన బుద్ధి మారదని నిరూపించుకుంది. అరుణాచల్ ప్రదేశ్‌లో ఉన్న పాస్పోర్ట్‌పై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తూ, యూకేలో ఉంటున్న భారతీయ మహిళను తీవ్రంగా వేధించారు.
అరుణాచల్ ప్రదేశ్ చైనాదని వాదన..
లండన్‌లో నివసించే అరుణాచల్ ప్రదేశ్ నుంచి వచ్చిన పేమా వాంఘజామ్ థోంగ్ డాక్, జపాన్ ప్రయాణార్థిగా మధ్యంతర విరామంలో షాంఘై విమానాశ్రయంలో ఆగింది. ఈ సందర్భంగా ఆమె పాస్‌పోర్టు పరిశీలించిన అధికారులు దానిపై ‘అరుణాచల్ ప్రదేశ్–భారతదేశం‘ అని స్పష్టంగా ఉన్నా, చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు దీనిని తిరస్కరించారు. చైనా ప్రాంతాన్ని తమదిగా భావిస్తే ఎలా అని, ఈ పాస్‌పోర్టు చెల్లదని ఇబ్బంది పెట్టారు. చైనా అధికారులు 18 గంటల పాటు వేధింపులు చేసినట్లు సమాచారం.
ఇండియన్ ఎంబసీ సహాయంతో..
చైనా అధికారుల ఒత్తిడితో ఆమె టికెట్లు మార్చుకోవడానికి, భోజనం చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడింది. విమానాశ్రయ టెర్మినల్స్ మధ్య కదలడానికి కూడా అంతరాయం కల్పించారు. చివరకు భారత ఎంబాసీ సహాయంతో ఆమె పాస్‌పోర్టుకు చైనా ఓకే చెప్పింది. ఈ ఘటనే భారత్–చైనా మధ్య అరుణాచల్ ప్రదేశ్ విభజన విషయంలో జరుగుతున్న ఘర్షణకు నిదర్శనం. చైనా అందరికీ తెలుసునా కానీ అరుణాచల్‌ను తమవిగా చెప్పుకోవడం, విదేశాల్లో భారతీయుల పాస్‌పోర్టు విషయంలో సమస్య సృష్టించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై భారత ప్రభుత్వం ద్వారా గట్టిగా స్పందనలు రావాల్సిన అవసరం ఉంది.