spot_img
Homeఅంతర్జాతీయంIndia US Deal: భారత–అమెరికా డీల్‌.. ఎలా కుదిరింది? అందులో ఏముంది?*

India US Deal: భారత–అమెరికా డీల్‌.. ఎలా కుదిరింది? అందులో ఏముంది?*

India US Deal: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టాక.. 2.0 పాలన పూర్తిగా భారత వ్యతరేకంగానే సాగుతోంది. ఆరు నెలలుగా ట్రంప్‌ భారత్‌ను ఇబ్బంది పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మోదీపై, భారత్‌పై విమర్శలు చేస్తున్నారు. అయితే మన సహనం మోదీకి చికాకు తెప్పించింది. చివరకు మోదీ వద్దకు ట్రంపే దిగివచ్చేలా చేసింది. ట్రంప్‌ టారిఫ్‌ వార్‌ నుంచి వెనక్కి తగ్గారు. 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. ఇక నెలులగా జరుగుతున్న వాణిజ్య ఒప్పందం చర్చలు కొలిక్కి వచ్చాయి. మొదటి దశ వాణిజ్య ఒప్పందం ఆమోదం పొందింది. ఈమేరకు రెండు దేశాలూ ఐక్యంగా ప్రకటన విడుదల చేశాయి. పరస్పర ప్రయోజనాలు కలిగించే పూర్తి ఒప్పందానికి పునాది వేశాయి.

చరిత్రాత్మక విజయం..
తాజాగా కుదిరిన మధ్యంతర ఒప్పందంపై కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ స్పందించారు. ఈ ఒప్పందాన్ని భారత వాణిజ్య చరిత్రలో మైలురాయిగా ప్రకటించారు. ఇది దేశ ఎగుమతులకు 30 ట్రిలియన్‌ డాలర్ల అవకాశాలు తెరుస్తుందని చెప్పారు. ముఖ్యంగా చిన్న తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈలు), రైతులు, చేపలు పట్టేవారికి గణనీయ ప్రయోజనాలు చేకూరుతాయి. ఎగుమతుల పెరుగుదలతో దేశవ్యాప్తంగా మహిళలు, యువతకు అనేక ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.

ఒప్పందంతో కలిగే లాభాలు
భారత్‌–అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందంతో దుస్తులు, చర్మ సామగ్రి, జుట్టు ఉత్పత్తులు, ప్లాస్టిక్, రబ్బర్‌ వస్తువులు, కొన్ని రసాయనాలు, ఇంటి అలంకార వస్తువులు, చేతి పని నైపుణ్య ఉత్పత్తులు, ఎంపికైన యంత్రసామగ్రి ధరలు తగ్గుతాయి. అమెరికన్‌ పరిశ్రమ వస్తువులు, కొన్ని పండ్లు, సోయాబీన్‌ ఆయిల్, వైన్‌ వంటి వ్యవసాయ ఉత్పత్తులపై భారత్‌ టారిఫ్‌లను తొలగించనుంది లేదా తగ్గిస్తుంది. మరోవైపు, భారత జనరిక్‌ మందులు, రత్నాలు, వజ్రాలు, విమాన భాగాలపై అమెరికా సుంకాలు ఎత్తేసే అవకాశం ఉంది.

దిగుమతుల్లో కీలక మార్పులు
భారత్, రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఆపుతుందని అమెరికా పేర్కొంది. బదులుగా అమెరికా నుంచి పెద్ద మొత్తంలో ఇంధనం, గ్యాస్‌ దిగుమతి చేస్తామని భారత్‌ అంగీకరించింది. 500 బిలియన్‌ డాలర్ల విలువైన అమెరికన్‌ దిగుమతులకు మార్గం సుగమం అవుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular