India to USA flight tickets: అమెరికా అధ్యక్షుడు భారత్ తమ మిత్ర దేశం, నరేంద్రమయోదీ తన మిత్రుడు అంటూనే దెబ్బమీద దెబ్బ కొడుతున్నాడు. ఇప్పటికే టారిఫ్‌లు విధించారు. తాజాగా హెచ్–1బీ వీసాలో లాటరీ సిస్టం రద్దు చేశారు. అమెరికా వెళ్లేవారు లక్ష డాలర్లు చెల్లించాలని నిబంధన విధించారు. తాజాగా అమెరికా విమాన ప్రయాణ చార్జీలు కూడా పెంచేశారు. అమెరికా నుంచి ఇండియాకు విమాన ప్రయాణం ఎప్పుడూ ఆసక్తికరం, కానీ ధరలు సీజన్, బుకింగ్ సమయం, ఎయిర్‌లైన్ మీద ఆధారపడి మారతాయి.
ప్రస్తుత ధరలు ఇలా..
2025 సెప్టెంబర్–అక్టోబర్ మధ్య ్ఞఅమెరికా నుంచి ఇండియాకు రౌండ్–ట్రిప్ టికెట్లు సగటున 500 నుంచి 800 డాలర్ల మధ్య ఉన్నాయి. ఒక్కో వై టికెట్లు 300 నుంచి 400 నుండి మొదలవుతాయి. డల్లాస్ నుండి ఇండియాకు ధరలు 495–670 (సెప్టెంబర్ 20, 2025 డేటా). ఇదే డల్లాస్ టు ఇండియా (2 రోజుల క్రితం) రూ.49,500 నుంచి రూ.60 వేలు. న్యూయార్క్ టు ముంబై 584 (కువైట్ ఎయిర్‌వేస్, అక్టోబర్ 7–14). వాషింగ్టన్ టు ఢిల్లీ రూ.339 నుంచి (ఎయిర్ ఇండియా, ఒక్కో వై). ఆఫ్–పీక్ సీజన్ (సెప్టెంబర్)లో ధరలు తక్కువగా ఉంటాయి, అయితే పీక్ సీజన్ (డిసెంబర్)లో 1,300 డాలర్ల వరకు పెరుగుతాయి. ఇండియా నుండి అమెరికాకు వెనక్కి వస్తే, టికెట్లు రూ41 వేలు(490 డాలర్లు) నుంచి∙మొదలవుతాయి. డల్లాస్ ధరలు గత రెండు రోజుల్లో స్థిరంగా ఉన్నాయి, కానీ డిమాండ్‌తో మారే అవకాశం ఉంది.
ఈ ఏడాది ధరల ట్రెండ్స్..
ఫ్లైట్ ధరలు సీజన్, ఫెస్టివల్స్, వీక్‌డేస్‌పై ఆధారపడతాయి. 2025 ట్రెండ్స్ సెప్టెంబర్ (495–777) డాలర్లు, జనవరి, ఫిబ్రవరి (20% తక్కువ). డల్లాస్ నుండి ఇప్పుడు 495–670 డాలర్ల రేంజ్‌లో ఉంది. డిసెంబర్ (1,347 డాలర్లు సగటు), సమ్మర్, ఫెస్టివల్స్ (దీపావళి, హోలీ). డల్లాస్ ధరలు డిసెంబర్‌లో రూ.75,000 (900 డాలర్ల) వరకు పెరిగే అవకాశం. మంగళవారం, బుధవారం ఫ్లైట్స్ 20% చౌక. డల్లాస్ నుండి వీకెండ్ టికెట్లు 50– 100 డాలర్లు ఎక్కువ. గూగుల్ ఫ్లైట్స్ ప్రకారం, ధరలు టేకాఫ్‌కు ముందు 45 సార్లు మారతాయి. డల్లాస్ ధరలు రెండు రోజుల క్రితం రూ.49,500– రూ.60 వేలు నుంచి స్థిరంగా 590– 715 డాలర్ల రేంజ్‌లో ఉన్నాయి. 2025లో ఫ్లైట్ ధరలు 2–3% పెరిగే అవకాశం.