India-EU trade deal: 18 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న భారత్–ఈయూ(యురోపియన్ యూనియన్) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేక చొరవతో పూర్తి చేశారు. ఇది పూర్తిగా ఇటి ఇండియాకు, అటు యూఈకు గేమ్ ఛేంజర్ డీల్ అని ఇరు పక్షాలు భావిస్తున్నా. ఈ అగ్రిమెంట్‌తో భారత్‌లో చాలా వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది. మరోవైపు అమెరికా టారిఫ్‌ల తర్వాత భారత్‌లో చాలా రంగాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. తాజా డీల్‌లో తయారీ రంగం, ఫార్మా, వజ్రాల పరిశ్రమలు పుంజుకునే అవకాశ ఉంది. చాలా మందికి ఉద్యోగాలు లభిస్తాయని ఆశిస్తున్నారు. అయితే ఈ డీల్‌ను అగ్రరాజ్యం అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నాడు. అమెరికాతో వాణిజ్యం ఒప్పందంపై తరచూ కొర్రీలు పెడుతూ భారత్ నష్టపోయాలే అగ్రిమెంట్ చేయాలని ఒత్తిడి చేస్తోంది. దీంతో మోదీ ప్రత్యామ్నాయ ఒప్పందాలపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే బ్రిటన్, ఆస్ట్రేలియా, దక్షిణాప్రికాతోపాటు పలు దేశాలతో ఇప్పటికే వాణిజ్య ఒప్పందం చేశారు. తాజాగా ఈయూతో డీల్ కుదిరింది.
అమెరికా నిరాశకు కారణాలు..
అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ భారత్–ఐరోపా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ డీల్ తమను గాయపరిచిందని, ఈయూ యుద్ధ సమయంలో వాణిజ్య ప్రయోజనాలకు మొగ్గు చూపిందని మండిపడ్డారు. ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ ‘యూరోపియన్లు నన్ను నిరాశపరిచారు‘ అంటూ స్పష్టం చేశారు.
ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో ఆరోపణలు
ఉక్రెయిన్‌లో యుద్ధం కొనసాగుతున్నప్పటికీ ఈయూ భారత్‌తో డీల్ కుదుర్చుకోవడం తప్పని బెసెంట్ పేర్కొన్నారు. గతేడాది అమెరికా భారత దిగుమతులపై సుంకాలు విధించినప్పుడు ఈయూ మద్దతు ఇవ్వకపోవడాన్ని విమర్శించారు. సొంత ట్రేడ్ లాభాల కోసమే వారు మౌనంగా ఉన్నారని ఆరోపించారు.
ఈయూ దేశాలకు రష్యా చమురు
రష్యా చమురు భారత్‌కు వెళ్లి, శుద్ధి చేయబడి ఈయూ దేశాలకు ఎగుమతి అవుతోందని బెసెంట్ ఆరోపించారు. ఇది రష్యా యుద్ధానికి పరోక్షంగా ఆర్థిక సహాయంగా మారిందని వాదించారు. ఈ డీల్ గతంలోనూ అమెరికా నుంచి ఇలాంటి విమర్శలే ఎదుర్కొంది.
మొత్తానికి ఈ ఒప్పందం భారత్ ఎగుమతులను పెంచి, ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది. అయితే, అమెరికా–ఈయూ మధ్య టెన్షన్ పెరిగి, భారత్, ఈయూ, అమెరికా మధ్య దూరం పెంచే అవకాశం ఉంది. భవిష్యత్ సుంకాలు, డీల్‌పై ప్రభావం ఆసక్తికరంగా ఉంటుంది.