India Drone Warfare Strategy 2026: ప్రస్తుతం యుద్ధాల తీరు మారుతోంది. యుద్ధాలకు ఇది సమయం కాదని చాలా దేశాలు భావిస్తున్నాయి. అందుకే ప్రత్యక్ష యుద్ధాలకు దూరంగా ఉంటున్నాయి. అయితే సామ్రాజ్యవాద విస్తరణ కాంక్షతో అమెరికా చిన్న దేశాలై యుద్ధం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. అయితే యుద్ధ రీతులు మారుతున్నాయి. టెక్నాలజీ వినియోగం గణనీయంగా పెరిగింది. దీంతో భారత్ కూడా యుద్ధ వ్యూహాలను ఎప్పటికప్పు మార్చుకుంటోంది. ఆయుధాలను అప్‌గ్రేడ్ చేస్తోంది. ఇటీవలి యుద్ధాల్లో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ కూడా డ్రోన్ వినియోగంపై దృష్టిపెట్టింది. తాజాగా నాగాలాండ్‌లోని పెరెన్ జిల్లా జాలూకీలో ఇటీవల అస్సాం రైఫిల్స్‌తోపాటు రాడార్ ఆపరేషన్లు, ఎక్సర్సైజ్‌లు సాగడంతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వారం తర్వాత భారత సైన్యం ప్రకటన చేసింది. ఇది జాలూకీ డ్రోన్ ట్రైనింగ్ కేంద్రంలో డ్రోన్ వార్‌ఫేర్ శిక్షణ అని. ప్రపంచ యుద్ధాల్లో డ్రోన్ల కీలక పాత్రను బట్టి భారత మిలిటరీ ఈ రకం శిక్షణలకు ప్రాధాన్యత ఇస్తోంది.
జాలూకీ ఎందుకు కీలకం..
ఈశాన్య భారతదేశంలో మయన్మార్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న జాలూకీ కొండలు, లోయలతో కూడిన కఠిన భౌగోళిక ప్రాంతం. ఇక్కడ డ్రోన్ శిక్షణ ఆదర్శవంతమైనది. కొండ ప్రాంతాల్లో డ్రోన్ నియంత్రణ, లక్ష్య గుర్తింపు, దిశ మార్పులపై ప్రాక్టికల్ అనుభవం ఇస్తుంది. తీవ్రవాద సంస్థల చలనాలు ఎక్కువగా ఉన్న మయన్మార్ సరిహద్దు ప్రాంతంలో భద్రతా సన్నద్ధతకు ఉపయోగపడుతుంది. రాడార్ ఆపరేషన్లు, ప్రత్యర్థి డ్రోన్లను కౌంటర్ చేయడంపై దృష్టి పెడుతుంది.
ప్రపంచ యుద్ధాల్లో డ్రోన్ల పాత్ర
రెండు–మూడేళ్లుగా డ్రోన్లు యుద్ధాల్లో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చాయి. పశ్చిమాసియా యుద్ధంలో తక్కువ ఖర్చు డ్రోన్లు గల్ఫ్ దేశాలను ఎక్కువగా దెబ్బతీశాయి, రాడార్లు విఫలమయ్యాయి. మయన్మార్‌లోని ఐపీఎఫ్, ఎన్‌ఎస్‌ఈ వంటి తీవ్రవాద కేంద్రాలపై డ్రోన్ దాడులు తీవ్ర నష్టం కలిగించాయి. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో తక్కువ ఎత్తులో ఎగిరే డ్రోన్లు ట్యాంకులు, సైన్యాన్ని నాశనం చేశాయి. ఈ పాఠాల నుంచి భారత్ డ్రోన్ హ్యాండ్లింగ్, వ్యూహాత్మక దాడులు, లక్ష్య చేరడంపై శిక్షణ ఇస్తోంది.
భారత సైన్యం డ్రోన్ వ్యూహాలు
గతేడాది నుంచి దేశవ్యాప్తంగా డ్రోన్ ఎక్సర్సైజ్‌లు చేస్తోంది ఇండియన్ ఆర్మీ. ఆపరేషన్ ప్రచండ ప్రహార్ (అక్టోబర్ 2025) సర్‌క్రీక్‌లో సముద్ర తీరంలో నిర్వహించి భద్రతపై దృష్టి పెట్టింది. నవంబర్–డిసెంబర్ 2025లో విస్తృత డ్రోన్ ఆపరేషన్లు వివిధ ప్రాంతాల్లో వినియోగించింది. ఈ ఏడాది మార్చి 6 నుంచి 18 వరకు చైనా సరిహద్దులో ఉత్తర దాడులకు సన్నద్ధ ఎక్సర్సైజ్‌లు నిర్వహించింది. ఇలా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని సరిహద్దుల్లో భారల్ అలర్ట్‌గా ఉంది. ఇదే సమయంలో
భారత్ స్వదేశీ డ్రోన్ల ఉత్పత్తిని పెంచుతోంది.
ఈ ఎక్సర్సైజ్‌లు భారత సైన్యాన్ని డ్రోన్ యుగానికి సిద్ధం చేస్తున్నాయి. స్థానిక ఆందోళనలు తొలగిస్తూ, పారదర్శకత కల్పించారు. ప్రపంచ యుద్ధాల పాఠాలతో కూడిన ఈ వ్యూహం భారత్ సరిహద్దు భద్రతను బలోపేతం చేస్తుంది. డ్రోన్లు ఇక యుద్ధాల్లో ప్రధాన ఆయుధాలు – భారత మిలిటరీ దీనికి సన్నద్ధంగా మారింది.
