India And China Relations
India And China Relations: చైనా.. డూప్లికేట్‌కు మారుపేరు. కన్నింగ్‌కు పర్యాయపదం.. దురాక్రమణకు నిదర్శనం. మన పొరుగునే ఉన్న చైనా(China) ప్రపంచంలో మూడో సంపన్న దేశం. అమెరికా, రష్యా తర్వాతి స్థానాల్లో ఉంది. అయితే ఇతర దేశాల ఎదుగుదలను ఓర్వలేని చైనా.. తాజాగా భారత్‌ను మాత్రం ప్రశంసించింది.
Also Read: వక్ఫ్ చట్ట సవరణ బిల్లుతో వడివడిగా మారుతున్న కేరళ రాజకీయాలు
సరిహద్దు వివాదాల నేపథ్యంలో భారత్–చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, బీజింగ్(Beaging) నుంచి సానుకూల వ్యాఖ్యలు వెలువడ్డాయి. భారతదేశం ఆర్థిక వృద్ధి(India Econamy Goruth)ని చైనా ప్రశంసించింది, దీనిని ‘అద్భుతం, అమోఘం‘గా అభివర్ణించింది. రెండు దేశాల మధ్య సంబంధాలు స్థిరంగా ఉండాలని ఆశాభావం వ్యక్తం చేసింది. భారత్–చైనా దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా కోల్‌కతాలో నిర్వహించిన కార్యక్రమంలో చైనా కాన్సుల్ జనరల్ జువీ పాల్గొని, ‘హిందీ చినీ భాయ్ భాయ్‘ అంటూ భారత్ సాధించిన విజయాలను కొనియాడారు. గతంలోనూ చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్(Global Times) భారత్ ఆర్థిక వృద్ధిని ప్రశంసించింది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ వ్యూహాత్మకంగా ఎదుగుతోందని, ప్రపంచ వేదికపై క్రియాశీలక పాత్ర పోషిస్తోందని ‘భారత్ నరేటివ్’ పేరుతో ఒక కథనం ప్రచురించింది. ఈ కథనంలో భారత్ బలమైన ఆర్థిక వృద్ధి, అంతర్జాతీయ సంబంధాలు, చైనాతో వైఖరిలో వచ్చిన మార్పులను ప్రస్తావించింది. గతంలో చైనాతో వాణిజ్య సమతుల్యత లోపించినప్పుడు భారత్ ఆందోళన చెందేదని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిందని పేర్కొంది.
గ్లోబల్ టైమ్స్ కూడా..
గ్లోబల్ టైమ్స్ సంస్థ భారత అభివృద్ధిని మరింత వివరించింది. భారత్ రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో ప్రజాస్వామ్య ఏకాభిప్రాయం నుంచి భారతీయతను హైలైట్ చేసే స్థాయికి చేరుకుందని తెలిపింది. మోదీ (Modi)నాయకత్వంలో అమెరికా, జపాన్, రష్యా వంటి దేశాలతోపాటు కీలక ప్రాంతీయ కూటములతో భారత్ సంబంధాలు మెరుగుపడ్డాయని వెల్లడించింది. ఇది దేశ అభివృద్ధికి దోహదపడిందని వివరించింది. గత పదేళ్ల(Last ten Years)లో భారత్ వ్యూహాత్మకంగా ఎదిగి, ప్రపంచ శక్తిగా మారిందని, అంతర్జాతీయ సంబంధాల చరిత్రలో ఇటువంటి మార్పు అరుదుగా కనిపిస్తుందని పేర్కొంది.
నూతన రాజకీయ శక్తిగా..
భారత్ నూతన భౌగోళిక రాజకీయ శక్తిగా అవతరించిందని, దాని విదేశాంగ విధానం ప్రశంసనీయమని చైనా మీడియా కొనియాడింది. సరిహద్దు వివాదాలు ఉన్నప్పటికీ, ఈ సానుకూల వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడేందుకు ఒక అవకాశంగా మారవచ్చు. 75 ఏళ్ల దౌత్య సంబంధాల సందర్భంగా వెలువడిన ఈ ప్రశంసలు భవిష్యత్తులో సహకారానికి దారి తీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.