Waqf Amendment Bill : వక్ఫ్ చట్ట సవరణ బిల్లు.. యూమీడ్ బిల్లు అంటున్నారు. దీని మీద జరిగినటువంటి చర్చ ఇటీవల కాలంలో ఏ బిల్లుమీద జరగలేదు. ఇరువర్గాల వాదనలు వింటే.. ప్రభుత్వం వాదన ఏంటంటే.. ‘వక్ఫ్ బోర్డు అనేది దేశంలో మూడో అతిపెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉన్న సంస్థ. దాదాపు 8.72 లక్షల కోట్ల ప్రాపర్టీ ఉంది. 37.39 లక్షల ఎకరాలన వక్ఫ్ బోర్డ కలిగి ఉంది.
అయితే ఈ వక్ఫ్ బోర్డు పారదర్శకం లేదు. జవాబుదారితీనం లేదు. కొంతమంది వ్యక్తులు స్వార్థం కోసం ఈ భూములను వాడుకుంటున్నారు. అందుకే వక్ఫ్ బోర్డును పున: సమీక్షిస్తున్నారు. అందరు ముస్లింలు, మహిళలకు దీనిపై హక్కులు ఉండాలన్నది ప్రభుత్వం భావన..
వక్ఫ్ బోర్డుపై భారతీయ చట్టాలకు అవకాశం లేదు. హైకోర్టు, సుప్రీంకోర్టుక వెళ్లడానికి లేదు. దాన్ని మార్చాలన్నది ప్రభుత్వం వాదన..
ఇక వక్ఫ్ బోర్డు ది ఇది మత వ్యవహారమంటూ.. దీనిలో జోక్యం చేసుకోవద్దని వాళ్లు కోరుతున్నారు. చట్టాలకు అతీతంగా ఉన్న వక్ఫ్ చట్టాన్ని మార్చడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది
వక్ఫ్ చట్ట సవరణ బిల్లుతో వడివడిగా మారుతున్న కేరళ రాజకీయాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.