https://oktelugu.com/

వామ్మో… అక్కడ మాస్క్ పెట్టుకోకపోతే కరెంట్ షాక్ ఇస్తారట!

చాప కింద నీరులా శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ఒక్కో దేశంలో ఒక్కో తరహా నిబంధనలు అమలవుతున్నాయి. పలు దేశాల్లో మాస్క్ ధరించని వారికి భారీగా జరిమానాలు విధిస్తుంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రం చిత్రవిచిత్రమైన శిక్షలు విధిస్తున్నారు. ఈ శిక్షలు చూసి మాస్క్ పెట్టుకోవడం ఇష్టపడని వారు సైతం తప్పనిసరి పరిస్థితుల్లో మాస్క్ పెట్టుకుంటూ ఉండటం గమనార్హం. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి మాస్క్ ధరించడం మినహా మరో ఆప్షన్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 27, 2020 / 09:24 AM IST

    If you do not put the mask there is a current shock

    Follow us on

    చాప కింద నీరులా శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ఒక్కో దేశంలో ఒక్కో తరహా నిబంధనలు అమలవుతున్నాయి. పలు దేశాల్లో మాస్క్ ధరించని వారికి భారీగా జరిమానాలు విధిస్తుంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రం చిత్రవిచిత్రమైన శిక్షలు విధిస్తున్నారు. ఈ శిక్షలు చూసి మాస్క్ పెట్టుకోవడం ఇష్టపడని వారు సైతం తప్పనిసరి పరిస్థితుల్లో మాస్క్ పెట్టుకుంటూ ఉండటం గమనార్హం.

    ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి మాస్క్ ధరించడం మినహా మరో ఆప్షన్ కనిపించడం కనిపించడం లేదు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు మాస్క్ ధరించక తప్పదు. కొన్ని ప్రాంతాల్లో మాస్క్ ధరించని వాళ్లను కఠినంగా శిక్షించిన ఘటనల గురించి కూడా మనకు తెలుసు. అయితే అమెరికాలోని ఒహీయో ప్రాంతంలో మాత్రం మాస్క్ పెట్టుకోని మహిళకు అధికారులు చుక్కలు చూపించారు.

    మాస్క్ పెట్టుకోని మహిళకు కరెంట్ షాక్ ఇవ్వడంతో షాక్ అవ్వడం మహిళ వంతయింది. పూర్తి వివరాల్లోకి వెళితే ఓహియోలోని మారియోటా ప్రాంతంలో ఇటీవల ఫుట్ బాల్ మ్యాచ్ జరిగింది. ఈ ఫుట్ బాల్ మ్యాచ్ చూడటానికి ఒక మహిళ హాజరైంది. తన కొడుకు కూడా ఫుట్ బాల్ మ్యాచ్ ఆడుతుండటంతో మహిళ మ్యాచ్ ను చూడటానికి వచ్చింది. ఆ మహిళ మాస్క్ పెట్టుకోకపోవడంతో పోలీసులు ఆమెకు మాస్క్ పెట్టుకోవాలని సూచించారు.

    అయితే పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా మహిళ మాత్రం మాట వినలేదు. పైగా పోలీసులపై ఇష్టానుషారం వ్యాఖ్యలు చేసింది. దీంతో పోలీసులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. సదరు మహిళ మాటలతో చెబితే వినే రకం కాదని చెప్పారు. దీంతో పోలీసులు మహిళకు లేజర్ గన్ తో షాక్ ఇచ్చారు. అనంతరం పోలీసులు మహిళను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.