Monkeypox: దేశంలో మరోసారి కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. సంవత్సరం పాటు కేసులు నమోదైనా తీవ్రత కలిగించ లేదు. కానీ ఇటీవల నమోదవుతున్న కేసులతో మరణాలు కూడా సంభవిస్తున్నారు. ఇదే తరుణంలో కొత్తగా మంకీ ఫాక్స్ భయపెడుతోంది. యూరప్ లో మొదలైన మంకీఫాక్స్ భారతదేశానికి పాకింది. కేరళలో మొదలైన మొదటి కేసు వెలుగులోకి రావడంతో వైద్యాధికారులు అప్రమత్తమమ్యారు. మంకీ ఫాక్స్ ను విస్తరించకుండా మార్గదర్శకాలు జారీ చేశారు. అటు విదేశాల నుంచి వచ్చే విమాలను కట్టడి చేస్తున్నారు. ఇదిలా ఉండగా మంకీపాక్స్ కు, స్వలింగ సంపర్కానికి సంబంధముందా..? అనే అనుమానాలు బలపడుతున్నాయి. స్వలింగ సంపర్కంతోనే ఈ వైరస్ విస్తరిస్తోందని కొందరు అంటున్నారు.

దేశంలో 2020లో మొదలైన కరోనా వైరస్ ఫస్ట్ వేవ్ తో సమస్య లేకపోయినా రెండో వేవ్ తీవ్ర ప్రభావాన్ని చూపింది. దేశంలో దాదాపు ప్రతి మూలకు కరోనా విస్తరించింది. అయితే గత సంవత్సరం పాటు కాస్త కేసులు తగ్గినా జీరో స్థాయికి మాత్రం రాలేదు. ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతున్నా స్వల్పంగా కేసులు నమోదవుతున్నాయి. అయితే గత వారం రోజులుగా వాతావరణంలో మార్పులతో పాటు కరోనా కేసులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. అటు మరణాలు కూడా జరగడం ఆందోళనకు తెరలేస్తోంది.
Also Read: Kesineni Family: తెరపైకి చిన్ని..ప్రస్టేషన్ లో కేశినాని నాని..విజయవాడ టీడీపీలో అసలేం జరుగుతోంది?
24 గంటల్లో దేశంలో 20, 557 కొత్త కేసులు నమోదయ్యాయి. 18,517 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. 40 మంది మరణించారు. ప్రస్తుతం పాజిటివీ రేటు 4.138 శాతంగా నమోదవుతోంది. నెల కిందట 500 లోపు నమోదైన కేసులు ఇప్పుడు 20వేలకు పైగానే నమోదవుతున్నాయి. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయని వైద్యాధికారులు తెలుపుతున్నారు. ఓ వైపు కోలుకున్న వారి సంఖ్య పెరుగుతున్నా.. ఆ స్థాయిలోనే మరణాలు కూడా ఉంటున్నాయంటున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు కొత్తగా మంకీ ఫ్యాక్స్ కేసులు కలవరపెడుతోంది.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 14000 మంకీ ఫ్యాక్స్ కేసులు నమోదయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇండియాలో కేరళ రాష్ట్రంలో మొదటి కేసు నమోదైంది. రెండో కేసు కూడా ఆ రాష్ట్రంలోనే నమోదైంది. ఇప్పటి వరకు ఆఫ్రికా దేశాల్లో 5గురు మంకీ ఫ్యాక్స్ తో మరణించారు. ఎక్కువగా ఈ కేసులు యూరప్ లోనమోదవుతున్నట్లు డబ్ల్యూహెచ్ వో తెలిపింది. అయితే మంకీ ఫ్యాక్స్ బలపడడానికి కారణం పురుఫులతో పురుషులు సెక్స్ చేయడమేనని అంటున్నారు. ఇలా చేయడంతోనే ఈ వైరస్ విస్తరిస్తోందని తెలుపుతోంది.
మంకీఫ్యాక్స్ వైరస్ నేపథ్యంలో వైద్యాఆరోగ్యశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అధికారులు ఈ వైరస్ విస్తరించకుండా చర్యలు చేపడుతున్నారు. ఇటీవల డబ్ల్యూహెచ్ వో నిర్వహించిన రెండో అత్యున్నత సమావేశం నిర్వహించారు. ఇటు భారత్ లోనూ పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ప్రత్యేకించి విమానాలపై ఆంక్షలు విధిస్తున్నారు. ఒక చోట నుంచి మరో చోటుకు ప్రయాణించే వారు ఆనారోగ్యానికి గురైతే వారిని ప్రత్యేకంగా పరీక్షిస్తున్నారు. ఇక శరీరంపై ఎలాంటి గాయాలు ఉన్నా వారిని కలుసుకోకూడదని చెబుతున్నారు.
Also Read:Rupee Falling: రూపాయి పతనం ఎందాకా?
[…] […]