Highest Life Expectancy: మనిషి ఆయుష్షు పెరిగింది. ఒకనాటితో పోలిస్తే ప్రస్తుతం గణనీయమైన పురోగతి సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా ఆయుష్షు పెరుగుదల ఆయా దేశాల ఆహారపు అలవాట్లు, వాతారవణ పరిస్థితులు, సాంకేతికత, వైద్యం అభివృద్ధి ఆధారంగా భిన్నంగా ఉంది. కానీ మొత్తంగా మాత్రం పెరిగింది. ఆరు దశాబ్దాల చరిత్ర పరిశీలిస్తే ప్రపంచంలో అన్ని దేశాల ఆయుర్ధాయం పెరిగింది.
జాపాన్ నంబర్ వన్..
జపాన్‌లో ఇప్పటికీ అత్యధిక ఆయుష్షు కనిపిస్తోంది – 2023లో సగటు ఆయుష్షు 84.8 ఏళ్లు. ఆరోగ్యకరమైన ఆహారం, అధిక ఉద్యమం, మెరుగైన వైద్య సేవలు అక్కడ జీవన ప్రమాణాన్ని పెంచుతున్నాయి.
భారత్‌లో గణనీయమైన వృద్ధి..
ఇక మన దేశంలో 60 సంవత్సరాల క్రితం 46 ఏళ్లు మాత్రమే ఉండేది. ఇప్పుడు 72 ఏళ్లకు పెరిగింది. ఇది మెరుగైన వైద్య సేవలు, పరిశుభ్రత, ఆరోగ్యంపై అవగాహన, శ్రద్ధను సూచిస్తున్నాయి. ఆధునిక ఆహారపు అలవాట్లు కూడా మన ఆయుష్షును పెంచాయి.
ప్రపంచ వ్యాప్తంగా పెరుగుదల..
1960తో పోలిస్తే ఇప్పుడు ప్రపంచ సగటు జీవిత కాలం 51 నుంచి 73.3కి పెరిగింది. అభివృద్ధి చెందిన దేశాల్లో అధిక జీవన ప్రమాణంతో అధిక ఆయుష్షు ఉంది. ఇటలీ, స్విజర్లాండ్, సింగపూర్ వంటి దేశాలు కూడా జపాన్ దగ్గరగా ఉన్నాయి.
అమెరికాలో స్థిరత్వం, చైనాలో వేగం..
అమెరికాలో సగటు ఆయుష్షు పెరుగుదల నెమ్మదిగానే ఉంది(78.4 ఏళ్లు). దీనికి జీవనశైలి, ఊబకాయం, ఆరోగ్య అసమానతలు కారణాలు. చైనాలో 33 నుంచి 78 ఏళ్లకు పెరుగుదల వచ్చింది. ఇది ఆహార అలవాట్లు, వైద్య అభివృద్ధి వల్ల సాధ్యమైంది.
ఫిజికల్ యాక్టివిటీ, పోషకాహారం, సముచిత ఆరోగ్య సంరక్షణ దేశ దేశాల ఆరోగ్యాన్ని నిలబెడుతున్నాయి. ఆయుష్షు పెంపులో భారతదేశం కలిసిన మార్పులు ప్రపంచ ఆరోగ్య మార్గదర్శకాలకు చక్కటి ఉదాహరణగా నిలుస్తున్నాయి.