Hidden Facts of Jagannath Rath Yatra: పూరి జగన్నాథ( Puri Jagannath ) రథయాత్రకు ఎంతో విశిష్టత ఉంది. శతాబ్దాల చరిత్ర ఉంది. ఆషాడ మాసంలో రెండో రోజు రథయాత్రను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆషాడ మాసం అనగానే ముందుగా గుర్తొచ్చేది జగన్నాధుడి రథయాత్ర. అయితే ఎన్నెన్నో వింతలు, విశేషాలు ఈ రథయాత్ర సొంతం చేసుకుంది. ఒక్క ఒడిస్సా లోనే కాదు ఉత్తరాంధ్రలో సైతం ఈ రథయాత్ర నిర్వహిస్తారు. ఈనెల 25 నుంచి ఈ రథయాత్ర కొనసాగనుంది. అయితే ఈ రథయాత్రకు సంబంధించిన వింతలు చాలామందికి తెలియవు.
1. ప్రపంచంలోనే అతి పురాతనమైన రథయాత్ర పూరి జగన్నాధుని రథయాత్ర. ఇది ఎన్ని వేల సంవత్సరాలకు ముందు మొదలైందో తెలియదు. బ్రహ్మపురాణం, పద్మ పురాణం, స్కంద పురాణం వంటి వాటిలో ఈ రథయాత్ర గురించి ప్రస్తావన ఉంటుంది.
2. సాధారణంగా గుడిలో అయినా ఉత్సవ విగ్రహాలను మాత్రమే ఊరేగింపుకు వాడతారు. కానీ పూరీలో అలా కాదు. గర్భగుడిలో ఉండే దేవుల్లే గుడి గుడి బయటకు వస్తారు. ఆ సమయంలో ఏ మతం వారు అయినా స్వామివారిని దర్శించుకోవచ్చు.
3. ఏటా నిత్య నూతనంగా రథయాత్ర కోసం రథాలను తయారు చేస్తారు. వీటి తయారీని అక్షయ తృతీయ రోజున మొదలు పెడతారు. జగన్నాథుడి కోసం చేసే రథాన్ని గరుడ ధ్వజం అని.. బల భద్రుని కోసం చేసే రథాన్ని తాళ ధ్వజం అని.. సుభద్ర కోసం తయారు చేసే రధాన్ని దేవదాలన అని పిలుస్తారు.
4. ఈ రథం తయారు చేసేటప్పుడు కొన్ని నిబంధనలు పాటిస్తారు. ఈ రథం ఎన్ని అడుగులు ఉండాలి? దానికి ఎన్ని చక్రాలు ఉండాలి? ఆ చక్రాలు ఎంత ఎత్తు ఉండాలి లాంటి లెక్కలను పాటించాల్సి ఉంటుంది. ప్రధాని తయారు చేసేందుకు ఎంత కలప వాడాలో కూడా లెక్క ఉంటుంది.
5. పూరీలో జగన్నాధుడికి ప్రత్యేకత ఉంటుంది. ఆ ఊరికి రాజు ఆయనే. జగన్నాధుని రథయాత్ర ప్రారంభానికి ముందు ఆ రథం ముందర బంగారు చీపురుతో ఊడుస్తాడు.
6. సాధారణంగా రథయాత్రలు ఊరంతా తిరిగి చివరికి ఆలయానికి చేరుకుంటాయి. కానీ జగన్నాధుని రథయాత్ర అలా కాదు. జగన్నాధుడికి గుండిచా అనే పిన్ని గారు ఉన్నారు. ఆవిడ ఉండే గుడి పూరి ఆలయానికి ఓ రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జగన్నాథుడు ఈ నవరాత్రులలో ఆ ఆలయంలోనే ఉంటాడు. తిరిగి ఆషాడ మాసంలోని పదో రోజున పూరి గుడికి చేరుకుంటాడు.
7. జగన్నాధుని రథయాత్ర సమయంలో తప్పకుండా వర్షం పడుతుంది. కొన్ని గంటలపాటు కొన్ని వేలమంది కలిసి లాగితే కానీ రథం కదలదు.
8. ఇలా అన్ని విశిష్టతలను కలిగి ఉంది ఈ రథయాత్ర. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు స్వామివారి రథయాత్రకు తరలి వస్తుంటారు.