Hanuman Logo In Thailand: త్వరలో థాయ్‌లాండ్‌లో ఏషియన్ అథ్లెటిక్స్ పోటీలు జరుగనున్నాయి. ఇందుకోసం అక్కడి ప్రభుత్వం, క్రీడా సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో క్రీడలకు సంబంధించిన లోగోను రూపొదించింది ప్రభుత్వం. ఇందులో హనుమాన్ ముఖం ఉంది. థాయ్ శైలిలో దీనిని డిజైన్ చేశారు. ఇటీవలే ఆవిష్కరించారు కూడా. అయితే హనుమాన్ను పెట్టడానికి కారణాలను కూడా క్రీడా సంస్థ తెలిపింది. ఆంజనేయుడు శక్తికి, యుక్తికి, ధైర్యానికి ప్రతీక అని అందుకే ఆంజనేయుడిని ఎంపిక చేసుకున్నామని ప్రకటించింది.
సాంస్కృతిక ప్రేరణ శక్తి..
హనుమాన్ భారతీయ సంస్కృతిలో బలం, ధైర్యం, వివేకానికి ప్రతీక. థాయ్‌లాండ్ దీన్ని స్వీకరించడం ఆగ్నేయాసియాలో హిందూ ప్రభావాన్ని తెలియజేస్తుంది. ఇలాంటి లోగోలు క్రీడా సంఘాలకు సాంస్కృతిక గుర్తింపును ఇస్తాయి. పోటీదారులు, అభిమానులకు మానసిక బలాన్ని అందిస్తాయి. ఇది గ్లోబల్ క్రీడల్లో సాంస్కృతిక వైవిధ్యానికి ఉదాహరణ నిలిచింది.
మన దేశంలో పెట్టి ఉంటే..
ఇక మన దేశంలో క్రీడల్లో ఇలా ఆంజనేయుడు లేదా కుమారస్వామి లోగో పెట్టి ఉంటే పెద్ద రచ్చ చేసేవారు. క్రీడా రంగం కాషాయీకరణ జరుగుతోందని ఉద్యమాలు చేసేవారు. లెఫ్ట్ నేతలు, లౌకిక వాదులు, సూడో లౌకికవాదులు అంతా పోరాటాలు చేసేవారు. దేవుళ్లు పొటోలతో మతపరమైన వివాదానికి తెరలేపేవారు. మతాల మధ్య చిచ్చు పెట్టేవారు. 80 శాతం హిందువులు ఉన్న దేశంలో కూడా హిందువులకు సంబంధించిన దేవుళ్లను పెట్టుకునే స్వేచ్ఛ కూడా ఉండడం లేదు.
థాయ్‌లాండ్ స్వేచ్ఛగా సాంస్కృతిక ప్రతీకలు ఉపయోగిస్తుంటే, భారత్‌లో రాజకీయ సమస్యలు అడ్డుకుంటాయి. ఇది మన క్రీడా సంస్థల బలహీనతను బహిర్గతం చేస్తుంది.. సాంస్కృతిక వైవిధ్యాలు వివాదాస్పదంగా మారతాయి.