https://oktelugu.com/

Hanuman Janaythi 2024: హనుమంతుడికి ఇష్టమైన ఈ రాశి వారికి ఈరోజు అనుకోని లాభాలు..

హనుమంతుడికి ఇష్టమైన రాశిగా సింహారాశిని పేర్కొంటారు. దీంతో ఈ రాశిపై దైవానుగ్రహం ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు ఏ పనిచేసినా సక్సెస్అవుతుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : April 23, 2024 / 10:03 AM IST

    Hanuman Jayanthi.Horoscope jpg

    Follow us on

    Hanuman Janaythi 2024:  ప్రతీ ఏడాది చైత్రమాసం శుక్ల పక్షం పౌర్ణమి రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. 2024 ఏడాదిలో ఏప్రిల్ 23న చిన్న హనుమాన్ జయంతిని నిర్వహించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జయంతి వేడుకను భక్తులు ఘనంగా నిర్వహిస్తున్నారు. హనుమాన్ ఆలయాలలతో పాటు రామాలయాల్లో జయంతి సందడి నెలకొంది. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ స్వామి వారి అనుగ్రహం పొందుతున్నారు. అయితే హనుమాన్ జయంతి సందర్భంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో మార్పులు రానున్నాయి. ఆ రాశులు ఏవంటే?

    • హనుమాన్ జయంతి సందర్భంగా కొన్ని రాశులపై తీవ్ర ప్రభావం ఉండనున్నాయి వాటిలో కుంభ రాశి ఒకటి. ఈ రాశి వారికి స్వామి వారి అనుగ్రహం ఉంటుంది. ఈరోజు వీరికి ధనలాభం ఎక్కువగా ఉంటుంది. అనుకున్న పనులు సాగుతాయి. ఆర్థిక పురోగతి ఉంటుంది. గతంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారులు ఎలాంటి పెట్టుబడులు పెట్టినా లాభాలు వస్తాయి. ఉద్యోగులు మనశ్శాంతితో ఉంటారు.
    • వృశ్చిక రాశి వారిపై హనుమాన్ అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది. ఈ రాశి వారి ఇంట్లో ఆనంద వాతావరణం ఉంటుంది. గతంల ఉన్న నెగెటివ్ ఎనర్జీ పోతుంది. ఉద్యోగులు ప్రమోషన్లు పొందే అవకాశం ఉంది. వ్యాపారులకు లాభాలు ఉంటాయి. అయితే కొన్ని దీర్ఘ కాలిక సమస్యల నుంచి పూర్తిగా ఉపశమనం పొందాలంటే ఈరోజు హనుమాన్ ను ప్రత్యేకంగా పూజించాల్సి ఉంటుంది.
    • హనుమంతుడికి ఇష్టమైన రాశిగా సింహారాశిని పేర్కొంటారు. దీంతో ఈ రాశిపై దైవానుగ్రహం ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు ఏ పనిచేసినా సక్సెస్అవుతుంది. గతంలో ఉన్న కష్టాలన్ని తొలగిపోతాయి. భవిష్యత్ కోసం చేసే కార్యక్రమాలు సక్సెస్ అవుతాయి. వ్యాపారులకు అనుకోని లాభాలువస్తాయి.