spot_img
Homeఅంతర్జాతీయంGulf war impact on India: గల్ఫ్‌ యుద్ధం.. భారత్‌ ఎలా తట్టుకుంటోందో తెలుసా?

Gulf war impact on India: గల్ఫ్‌ యుద్ధం.. భారత్‌ ఎలా తట్టుకుంటోందో తెలుసా?

Gulf war impact on India: గల్ఫ్‌ యుద్ధం కారణంగా అత్యంత ప్రభావితం అయ్యే దేశాల్లో భారత్‌ కూడా ఒకటి. మన దేశంలో చమురు, ఎల్‌పీజీ వినియోగం పెరిగిన కారణంగా మన గల్ఫ్‌ దేశాలపై ఆధారపడి ఉన్నాం. దీంతో మనం కూడా ప్రభావితం అవుతున్నాం. 90 శాతం చమురు, ఎల్‌పీసీ 60 శాతం, ఎల్‌ఎన్‌జీ 50 శాతం దిగుమతి చేసుకుంటున్నాం. పూర్తిగా గల్ఫ్‌గా, చమురు ఉత్పత్తి దేశాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నా. బ్యాదల్‌ మాండెల్, ఆర్మూజ్‌ జలసంధిలో ఇబ్బందులు వచ్చినా ప్రభావితం అవుతున్నాం. కానీ తట్టుకుని నిలబడుతున్నాం.

దిగుమతులే ఆధారం..
భారత్‌ గల్ఫ్‌ దేశాల నుంచి 90% క్రూడ్‌ ఆయిల్, 60% ఎల్‌పీజీ, 50% ఎల్‌ఎన్‌జీ దిగుమతి చేస్తోంది, ఇది రోజువారీ వినియోగాన్ని 5 మిలియన్‌ బ్యారెళ్లకు చేర్చింది. బ్యాబ్‌ ఎల్‌ మండబ్, స్ట్రెయిట్‌ ఆఫ్‌ హార్మూజ్‌ జలసంధుల్లో దాడులు జరిగినా, రోజుకు 7–8 మిలియన్‌ బ్యారెళ్ల సరఫరా దెబ్బతింటుంది. ధరలు 20% పెరిగి బ్యారెల్‌కు 95 డాలర్లు దాటింది. దీని వల్ల దిగుమతి ఖర్చు వారానికి రూ.15 వేల కోట్లు పెరిగింది.

ముందస్తు చర్యలతో స్థిరంగా..
అయితే భారత్‌ ముందస్తున ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. ఎక్కువ నిల్వలు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 25 రోజులకు సరిపోయే క్రూడ్‌ నిల్వలు, ఎల్‌పీజీ 30 రోజులకు, పెట్రోల్, డీజిల్‌ 25 రోజులకు, ఎల్‌ఎన్‌జీ పది రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయి. వీటిని జాగ్రత్తగా వాడుకోవడం ద్వారా ప్రస్తుతం క్రైసిస్‌ నుంచి బయటపడే వీలు ఉంటుంది.

వ్యూహాత్మక ప్రణాళికలు..
భారత్‌ మూడు రకాలుగా ప్రయత్నం చేస్తోంది. వ్యూహాత్మక ప్రణాళికలు రూపొందిస్తోంది. రష్యా నుంచి 30 బిలియన్‌ బ్యారెళ్ల ఇంధనం దిగుమతి చేసుకుంటున్నాం. అంగోలా నుంచి 3.4 మిలియన్‌ బ్యారెళ్లు, కాంగో నుంచి 1.3 మిలియన్‌ బ్యారెళ్ల ఆయిల్‌ దిగుమతి చేసుకుంటున్నాం. వీటిద్వారా మనపై యుద్ధ ప్రభావం తగ్గించుకుంటున్నాం. ఒక దేశంపై ఆధారపడకుండా 40 దేశాల నుంచి చమురు కొంటున్నాం. ప్రస్తుతం యుద్ధం జరుగుతున్న గల్ఫ్‌ దేశాల నుంచి 70 శాతం చమురు ఆగిపోయింది. అయినా ఇబ్బంది లేదు. దౌత్యపరంగా ఇరాన్‌తో మాట్లాడడంతో మన ఓడలు సురక్షితంగా భారత్‌కు వస్తున్నాయి.

స్ట్రాటజిక్‌ రిజర్వులు..
మోదీ అదికారంలోకి వచ్చాక మన స్ట్రాటజిక్‌ రిజర్వులు పెంచేందుకు ఇండియన్‌ స్టాటజిక్‌ పెట్రోలియం రిజర్వ్స్‌ లిమిటెడ్‌ అనే కార్పొరేషన్‌ ఏర్పాటు చేసింది. దేశంలో మూడు ప్రాంతాల్లో చమురు నిల్వ చేస్తోంది. అండర్‌గ్రౌండ్‌లో పెద్ద ఎత్తున చమురు నిల్వలు చేస్తోంది. భూమి ఉపరితలం నుంచి 500 మీటర్ల లోపల స్టోరేజీ కెపాసిటీ ఉంది. 10 ఏళ్ల క్రితం విశాఖపట్టణంలో ఏర్పాటు చేశారు. తర్వాత తమిళనాడులోని పాదూర్‌లో రిజర్వులు ఏర్పాటు చేశారు. కర్ణాటకలోని మంగళూరులో కూడా నిర్వలు ఏర్పాటు చేశారు. విశాఖపట్టణంలో 60 మిలియన్‌ టన్నుల నిల్వల సామర్థ్యం ఉంది. మంగళూరులో 20 వేల టన్నులు, పాదూరులో కూడా 20 వేల టన్నులు నిల్వ సామర్థ్యం ఉంది.

ఎల్‌పీజీకి ఇబ్బందులు..
వార్షికంగా మనకు 31 మి.టి ఎల్‌పీజీ అవసరం ప్రస్తుతం 20% కొరత ఉన్నా, కమర్షియల్‌ (హోటల్స్, ఇండస్ట్రీలు) వాడకంపై 25% కోత పెట్టి 80% గృహావసరాలు (10 మి.టి.) రక్షించారు. 2014లో మోదీ అధికారంలోకి వచ్చాక గ్యాస్‌ కనెక్షనుల గణనీయంగా ఇచ్చారు. ప్రస్తుతం 33 కోట్ల కనెక్షన్లు ఉన్నాయి. బాటలింగ్‌ స్టేషన్లు 23 మెట్రిక్‌ టన్నులకు పెంచారు. ఈ స్టేషన్లు 186 నుంచి 210కి పెంచాం. ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్లు 13 వేల నుంచి 25 వేలకు పెరిగారు. వాడకం పెరిగింది. అందుకు తగినట్లుగా ఉజ్వల్‌ యోజన కింద గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చారు. ఒడిదుడుకులు ఉన్నా భారత్‌ తట్టుకుంటోంది.

మిగతా దేశాలతో పోలిస్తే మనం ప్రభావితం కావడం లేదు. పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌ మాత్రం తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. మోదీ ప్రభుత్వ ముందచూపు ఇప్పుడు మనల్ని సురక్షితంగా ఉంచింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular