Homeఅంతర్జాతీయంGulf Tensions : గల్ఫ్‌ ఉద్రిక్తతలు తీవ్రం.. ఇరాన్‌పై చిన్న దేశాల వ్యూహాత్మక దాడులు!

Gulf Tensions : గల్ఫ్‌ ఉద్రిక్తతలు తీవ్రం.. ఇరాన్‌పై చిన్న దేశాల వ్యూహాత్మక దాడులు!

Gulf Tensions : పశ్చిమాసియా మళ్లీ అగ్నిగుండంలా మారుతోంది. అమెరికా–ఇజ్రాయెల్‌తో ఇరాన్‌ మధ్య ఘర్షణలు విస్తరిస్తుండగా, గల్ఫ్‌ ప్రాంత దేశాలు నేరుగా తమ ప్రమేయం లేకపోయినా బాధిత దేశాలుగా మారాయి. అమెరికాకు స్థావరాలు ఇచ్చినందుకు ఇరాన్‌ గల్ఫ్‌ దేశాలపై ప్రత్యక్ష దాడులు చేస్తోంది. ఈ దాడులు ఆ దేశాల అంతర్జాతీయ ప్రతిష్టపై తీవ్ర ప్రభావం పడుతోంది.

ఇరాన్‌ లక్ష్యాలపై వైమానిక చర్య
అమెరికా మీడియా నివేదికల ప్రకారం, జూలై ప్రారంభంలో బహ్రెయిన్, కువైట్‌ వైమానిక దళాలు ఇరాన్‌లోని డ్రోన్, క్షిపణి నిల్వలపై దాడులు చేశాయి. ఇది ఆ రెండు దేశాలు ఇరాన్‌పై నేరుగా సైనిక చర్యకు పాల్పడిన తొలి సందర్భం. యూఏఈ గూఢచర్య సమాచారం అందించి సహకరించింది. సౌదీ అరేబియా ప్రారంభంలో యూఏఈతో కలిసి ముందుకు వచ్చినా, తర్వాత తన వైఖరిని మార్చుకుంది. ఈ రెండు దేశాల వైమానిక దళాలు పరిమాణంలో చిన్నవి. అవి ఉపయోగించే యుద్ధ విమానాలు ప్రధానంగా అమెరికా, ఐరోపా దేశాల నుంచి వచ్చినవే. సైనిక అవసరాల్లో అమెరికాపై ఎక్కువగా ఆధారపడే ఈ దేశాలు, తమపై పదేపదే జరుగుతున్న దాడులకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కొనసాగుతున్న దాడులు..
రెండు వారాల క్రితం హార్మూజ్‌ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్‌ చర్యలు చేపట్టడంతో ప్రాంతం మళ్లీ అస్థిరమైంది. యూఎస్‌ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని బహ్రెయిన్, కువైట్‌తో పాటు జోర్డాన్‌పై కూడా ఇరాన్‌ దాడులు కొనసాగిస్తోంది. ఇరాన్‌ అమెరికా సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేస్తున్నామని చెప్తున్నా, ఆ దేశాల పేరు అంతర్జాతీయంగా దెబ్బతింటోంది.

సౌదీ, హూతీ ఘర్షణలు..
అమెరికా–ఇరాన్‌ ఉద్రిక్తతలతోపాటు సౌదీ అరేబియా, యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారుల మధ్య కూడా ఘర్షణలు తీవ్రమవుతున్నాయి. ఇరాన్‌ మద్దతు ఉన్న హూతీలు ఎర్రసముద్రంలో దిగ్బంధనం ప్రకటించి సౌదీ నౌకలపై దాడులు చేశాయి. దీనికి ప్రతిగా సౌదీ అరేబియా యెమెన్‌లోని హూతీ నియంత్రిత ప్రాంతాలపై వైమానిక దాడులు చేపట్టింది.

అమెరికా – ఇరాన్‌ యుద్ధం ప్రారంభమై ఆరు నెలలైంది. ఇంతకాలం ఓపిక వహించిన గల్ప్‌ దేశాలు తమ భద్రత కోసం అమెరికాపై ఆధారపడుతూనే, ఇరాన్‌ నుంచి వస్తున్న ప్రత్యక్ష ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. చిన్న సైనిక శక్తులు కూడా ఇప్పుడు ప్రత్యక్షంగా పాల్గొనడం ప్రాంతీయ యుద్ధం విస్తరణకు మరో దశగా కనిపిస్తోంది. ఇక ముందు పరిస్థితులు ఎలా మారతాయో అని అంతర్జాతీయ సమాజం ఆందోళన చెందుతోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Maruti Suzuki Brezza

Maruti Suzuki Brezza: మారుతి సుజుకీ Brezza.. ఇప్పుడు ఫేస్ లిప్ట్ లో.. ఎలా ఉండబోతుందంటే..

Maruti Suzuki Brezza: ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకీ కార్ల కంపెనీకి ప్రత్యేక స్థానం ఉంది. మిడిల్ క్లాస్ నుంచి ఉన్నత వర్గాల వరకు అనుకూలమైన కార్లు ఈ కంపెనీ అందిస్తుందని కొందరి...
today horoscope

Today Horoscope: ఈ ఐదు రాశుల వారికి అనుకూలం.. పెండింగ్ లో ఉన్న డబ్బు వసూలు..

Today Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు కొన్ని రాశుల వారికి అనుకోకుండానే శుభ ఫలితాలు రానున్నాయి. మరి కొన్ని రాశుల వారు...
July 2026 Horoscope

Today horoscope in telugu 26.7.2026 : ఈ ఐదు రాశుల వారికి అనుకూలం.. పెండింగ్ లో ఉన్న...

Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు కొన్ని రాశుల వారికి అనుకోకుండానే శుభ ఫలితాలు రానున్నాయి. మరి...

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...
Modi Gen Z Video

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...
Oktelugu Epaper