Kamala Harris: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అధికార డెమొక్రటిక్ పార్టీ తరఫున ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ బరిలో నిలిచారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్, హారిస్ మధ్య హోరాహోరీ పోరు సాగుతుందని అందరూ అంచనా వేశారు. కానీ, వార్ వన్‌సైడ్ అన్నట్లుగానే సాగింది. సర్వే సంస్థలు అమెరికన్ల నాడి పట్టడంలో విఫలమయ్యారు. ఈ ఎన్నికల్లో ట్రంప్ ఏకపక్షంగా విజయం సాధించారు. 301 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. ఇక ఈ ఎన్నికల్లో కమలా హారిస్ 250 సీట్లకే పరిమితమయ్యారు. ఫలితాల తర్వాత ఓటమిని అంగీకరించిన కమలా హారిస్.. తాను మొదలు పెట్టిన పోరాటాన్ని కొనసాగిస్తానని హూవార్డ్ యూనివర్సిటీలో గంభీరంగా ప్రకటించారు. ఇక ఆమె ఉపాధ్యక్ష పదవీకాలం ఇంకా 70 రోజులు ఉంది. ఆ తర్వాత ఆమె రాజకీయాల నుంచి తప్పుకుంటారన్న ప్రచారం జరుగుతోంది.
వచ్చే ఎన్నికలకు దూరం..
సాధారణంగా అమెరికా అధ్యక్ష ఎ న్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు వచ్చే ఎన్నికల్లోనూ పోటీకి ఇప్పటి నుంచే రెడీ అవుతారు. ఈమేరు అవకాశాలను మెరుగుపర్చుకుంటారు. లేదంటే ఏదో ఒక పదవిలో ఉంటారు. 2004లో జార్జిబుష్ చేతిలో ఓడిన జాన్ కెర్రీ, బారక్ ఒబామా రెండోసారి అధ్యక్షుడయ్యాక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఓడితే రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే కమలకు రాజకీయాల్లో కొనసాగే ఛాన్స్ లేదని తెలుస్తోంది. 2017 నుంచి 201 మధ్య కాలిఫోర్నియా నుంచి సెనేట్‌కు ప్రాతినిధ్యం వహించిన కమలా హారిస్ మళ్లీ సెనేట్‌కు వెళ్లే అవకాశం కనిపించడం లేదు. సొంత పార్టీ నుంచే ఆమెకు వ్యతిరేకత ఎదురవుతోంది.
సొంతరాష్ట్రంలో వ్యతిరేకత..
అధ్యక్ష ఎన్నికల్లో ఓడిన కమలా హారిస్‌కు సొంత రాష్ట్రంలోనూ డెమోక్రటిక్ పార్టీ నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. మరోవైపు అధ్యక్ష ఎన్నికల కోసం విరాళాలు ఇచ్చిన వారు కూడా ఆమెపై అసంతృప్తితో ఉన్నారు. పోటీ డెమోక్రటిక్ ప్రతినిధిగా అందుకు పరిస్థితులు అనుకూలంగా లేవు. దీంతో 2028 అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి అభ్యర్థిత్వం కోసం ఆమె తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి.
తప్పుకోవడమే మేలని..
ఇలాంటి పరిస్థితిలో రాజకీయాలకు దూరంగా ఉండడమే మేలని కమలా హారిస్ భావిస్తున్నారు. హిల్లరీ క్లింటన్, ఏఐ గోర్ మాదిరిగా సాహిత్య రచన, ఇతర వ్యాపకాల్లో మునిగిపోవచ్చని తెలుస్తోంది. పోరాడే అవకాశాలు తక్కువే అని విశ్లేషకులు భావిస్తున్నారు. వ్యక్తిగత జీవితంపైనా దృష్టి సారించవచ్చనే అభిప్రాయమూ ఉంది. అయితే అధ్యక్ష ఎన్నికలకు ఆమెకు అవకాశాలు ఉన్నాయని కమలా సన్నిహితులు చెబుతున్నారు.