
టోక్యో ఒలింపిక్స్ 202 గోల్ఫ్ మహిళా విభాగం తుది మ్యాచ్ రసవత్తరంగా మారింది. కేవలం రెండు హోల్స్ ఉన్న సమయంలో వర్షంతో మ్యాచ్ నిలిపి వేయడంతో ఫలితం ఏంటన్నది స్పష్టత రావాల్సి ఉంది. వర్షం కారణంగా మ్యాచ్ ముగిసేసమయానికి మొదటి ప్లేస్ లో నెల్లీ కోర్డా, రెండో ప్లేస్ లో ఇనామీ ఉన్నారు. మూడో ప్లేస్ లో అతిది, లైడియా ( న్యూజిలాండ్) ఇద్దరూ టై పొజిషన్ లో నిలవగా భారత్ పతకం ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. భారత్ కు చెందిన అతిది అశోక్ అద్భుతమైన ప్రదర్శన కనబరించింది.