https://oktelugu.com/

Gautam Adani : చరిత్ర సృష్టించిన గౌతం అదానీ: ప్రపంచంలోనే 3వ అత్యంత ధనవంతుడిగా అవతరణ

Gautam Adani world’s third-richest person : ఒక కాలేజీ డ్రాపవుట్, బొగ్గు గనుల తవ్వకం పరిశ్రమను మొదలుపెట్టడానికి ముందు వజ్రాల వ్యాపారిగా గుజరాత్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఇలా చిన్నా చితకా పరిశ్రమలతో మొదలైన గౌతం అదానీ ప్రస్థానం ఇప్పుడు ప్రపంచంలోనే టాప్ 3కి చేర్చింది. ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా మార్చింది. చివరికి అతిపెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించేదాకా సాగింది. ప్రపంచంలోని మూడవ అత్యంత సంపన్న వ్యక్తిగా మారి గౌతం అదానీ ఇప్పుడు చరిత్ర సృష్టించాడు. బ్లూమ్‌బెర్గ్ […]

Written By: NARESH, Updated On : August 30, 2022 9:54 am
Follow us on

Gautam Adani world’s third-richest person : ఒక కాలేజీ డ్రాపవుట్, బొగ్గు గనుల తవ్వకం పరిశ్రమను మొదలుపెట్టడానికి ముందు వజ్రాల వ్యాపారిగా గుజరాత్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఇలా చిన్నా చితకా పరిశ్రమలతో మొదలైన గౌతం అదానీ ప్రస్థానం ఇప్పుడు ప్రపంచంలోనే టాప్ 3కి చేర్చింది. ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా మార్చింది. చివరికి అతిపెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించేదాకా సాగింది. ప్రపంచంలోని మూడవ అత్యంత సంపన్న వ్యక్తిగా మారి గౌతం అదానీ ఇప్పుడు చరిత్ర సృష్టించాడు.

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో మొదటి మూడు స్థానాల్లో ఒక ఆసియా వ్యక్తి ప్రవేశించడం ఇదే మొదటిసారి. తోటి వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ మరియు చైనాకు చెందిన జాక్ మా ఇంతవరకూ ఈ స్థానానికి చేరుకోలేదు. 137.4 బిలియన్ల డాలర్ల సంపదతో గౌతం అదానీ తాజాగా ఫ్రాన్స్‌కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను అధిగమించాడు. ఇప్పుడు ర్యాంకింగ్‌లో అమెరికాకి చెందిన ఎలోన్ మస్క్ మరియు జెఫ్ బెజోస్‌లు తొలి రెండు స్థానాల్లో ఉండగా.. మన గౌతం అదానీ 3వ స్తానంలో వారి వెనుకాలే ఉన్నారు.

అదానీ 60 ఏళ్లకే ఈ ఘనత సాధించారు. గత కొన్ని సంవత్సరాలుగా తన బొగ్గు గనులు, పోర్టుల సామ్రాజ్యాన్ని విస్తరింపజేసారు. డేటా సెంటర్ల నుండి సిమెంట్, మీడియా మరియు అల్యూమినియం పరిశ్రమల వరకు ప్రతిదానిలో వెంచర్ చేస్తున్నారు. గౌతం అదానీ వ్యాపార సమూహం ఇప్పుడు భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్-రంగం గా విస్తరించింది. పోర్టులు మరియు విమానాశ్రయ ఆపరేటర్, సిటీ-గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ మరియు బొగ్గు మైనింగ్ ను కలిగి ఉంది. ఆస్ట్రేలియాలోని దాని కార్మైఖేల్ గని కూడా అదానీ సొంతం. ప్రపంచంలోని అతిపెద్ద పునరుత్పాదక-శక్తి ఉత్పత్తిదారుగా అవతరించడానికి గ్రీన్ ఎనర్జీలో $70 బిలియన్ల పెట్టుబడిని గౌతం అదానీ పెట్టారు.

కానీ గౌతం అదానీ అంతా అప్పులతో నిర్మించిందన్న ఆందోళనలు పెరుగుతున్నాయి. అదానీ డీల్స్ ప్రధానంగా రుణంతో నిధులు సమకూరుస్తుందని అంటున్నారు. అతని సామ్రాజ్యం “లోతైన అధిక రుణ పరపతి కలిగి ఉంది” అని క్రెడిట్ సైట్స్ ఈ ఆగస్టు చివరలో ఒక నివేదికలో పేర్కొంది. అదానీ వ్యాపారాలు అప్పుల ఊబిలో కూరుకుపోవచ్చని హెచ్చరించింది.

భారతదేశ దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకోవడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలకంగా భావించే రంగాలపై వ్యాపారవేత్త గౌతం అదానీ దృష్టి సారించారు. మోడీ సర్కార్ నుంచి గౌతం అదానీకి 100కు 200 శాతం సహాయ సహకారాలున్నాయని టాక్ నడుస్తోంది.

అదానీ 2022లోనే తన సంపదకు 60.9 బిలియన్ డాలర్లకు చేరుకున్నాడు. అందరికంటే ఈ ఏడాదిలో ఇది ఐదు రెట్లు ఎక్కువ. అదానీ మొదటిసారిగా అత్యంత ధనవంతుడైన ఆసియన్‌గా ఎదిగాడు. ఫిబ్రవరిలో అంబానీని అధిగమించాడు, ఏప్రిల్‌లో సెంటిబిలియనీర్ అయ్యాడు. మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్ అధినేత బిల్ గేట్స్‌ను గత నెలలో అధిగమించి ప్రపంచంలోని నాలుగో సంపన్న వ్యక్తిగా ఆవిర్భవించాడు.

అదానీ ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన అమెరికా బిలియనీర్‌లలో కొందరిని అధిగమించగలిగారు. వారు ఇటీవల వారి దాతృత్వాన్ని పెంచుకోవడంతో అదానీ ముందుకెళ్లారు. గేట్స్ జూలైలో బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్‌కు $20 బిలియన్లను బదిలీ చేస్తున్నట్లు తెలిపారు. వారెన్ బఫెట్ ఇప్పటికే $35 బిలియన్లకు పైగా స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇచ్చారు. దాతృత్వ కారణాల కోసం ఖర్చు చేసిన బిలియన్ల డాలర్లు బ్లూమ్‌బెర్గ్ సంపద ర్యాంకింగ్‌లో వారిని దిగువకు నెట్టాయి. వారు ఇప్పుడు వరుసగా ఐదో (బిల్ గేట్స్) మరియు 164వ స్థానంలో (వారెన్ బఫెట్) ఉన్నారు. దీంతో వారి సంపద తరిగి అదానీ సంపద పెరిగి ఈ స్థానానికి చేరుకున్నారు.

అదానీ కూడా తన 60వ జన్మదినాన్ని పురస్కరించుకుని సామాజిక ప్రయోజనాల కోసం $7.7 బిలియన్లను విరాళంగా ఇస్తానని జూన్‌లో ప్రతిజ్ఞ చేస్తూ తన దాతృత్వాన్ని పెంచుకున్నాడు. అతను ఇంకా దీనిపై ఎలాంటి వివరాలు ఇవ్వలేదు.