Gaokao Exam World Toughest Exam: భారత దేశంలో అత్యంత కఠినమైన పరీక్ష ఏదంటే చాలా మంది జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్ అని చెబుతారు. కొందరు సివిల్స్ కూడా అంటారు. మరి ప్రపంచంలో ఏ పరీక్ష అత్యంత కఠినమైనది అని అడిగితే చాలా మంది నిర్వికారంగా ఒకే పేరు చెబుతారు గావోకావో. చైనా జాతీయ ఉన్నత విద్యా ప్రవేశ పరీక్ష ఇది. ఒక్క పరీక్ష ఫలితం ఒక విద్యార్థి భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తుంది. ఇది కేవలం ఎగ్జామ్ కాదు, చైనాలో లక్షలాది కుటుంబాల ఆశలు, కలలు, ఒత్తిడి, జీవితాలను ఒకేసారి నిర్ణయించే జాతీయ యుద్ధం.
గావోకావో ఎందుకు టఫెస్ట్?
ఈ పరీక్ష మొత్తం 9 గంటలు నడుస్తుంది. సాధారణంగా 2 నుంచి 4 రోజుల వ్యవధిలో నిర్వహిస్తారు. ఒక్కసారి తప్పిపోతే మళ్లీ ఒక సంవత్సరం వేచి ఉండాలి. అత్యంత ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీల్లో సీటు సాధించాలంటే దేశవ్యాప్తంగా లక్షలాది మందితో తీవ్ర పోటీ పడాలి. ఈ ఏడాది (2026) గావోకావోలో 1.29 కోట్ల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఇందులో టాప్ యూనివర్సిటీల్లో సీటు సాధించే వారు కేవలం ఒక్క శాతమే.
గావోకావో తర్వాత అత్యంత కఠినం?
ప్రపంచంలోని అతి టఫ్ ఎగ్జామ్‌ల జాబితాలో గావోకావో తర్వాత స్థానాలు ఇలా ఉన్నాయి. భారత్‌లో ఇంజినీరింగ్‌లో ఉన్నత స్థాయి సీట్ల కోసం జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష. దీనిని యూపీఎస్‌సీ నిర్వహిస్తుంది. అత్యున్నత ఉద్యోగాలైన సివిల్ సర్వీసెస్ కోసం నిర్వహించే పరీక్ష ఉంది. తర్వాతి స్థానంలో అల్ సోల్స్ ప్రైజ్ ఫెలోషిప్ (యూకే ఆక్స్‌ఫర్డ్) ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ఫెలోషిప్ పరీక్షల్లో ఒకటి. యూఎస్‌ఎంఎల్‌ఈ(అమెరికా) వైద్యులకు లైసెన్స్ పొందడానికి ఈ అన్ని పరీక్షలకూ ఒక సాధారణ లక్షణం ఉంది. అపారమైన పోటీ, అపారమైన ఒత్తిడి, ఒక్క తప్పు కూడా తీవ్రమైన పరిణామాలను తెచ్చిపెట్టే సామర్థ్యం.
విద్యార్థులపై ప్రభావం..
గావోకావో, జేఈఈ అడ్వాన్స్‌డ్ లేదా యూపీఎస్‌సీ వంటి పరీక్షలు విద్యార్థులను కేవలం పరీక్షించడం మాత్రమే కాదు. వారి బాల్యం, యవ్వనం, నిద్ర, ఆరోగ్యం, స్నేహాలు అన్నింటినీ బలి చేసి, ఒకే లక్ష్యం వైపు నడిపిస్తాయి. చైనాలో గావోకావో సీజన్‌లో దేశమంతా ఒక అసాధారణ నిశ్శబ్దం నెలకొంటుంది. నిర్మాణాలు, హార్న్‌లు, ట్రాఫిక్ కూడా నియంత్రించబడతాయి. భారత్‌లో కూడా జేఈఈ, యూపీఎస్‌సీ సీజన్‌లో కోచింగ్ సెంటర్లు, రాత్రి పగలు అధ్యయనం, కుటుంబాల ఒత్తిడి సాధారణమే. ఈ పరీక్షలు ఒకవైపు మేధావులను ఎంపిక చేస్తాయి. మరోవైపు విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌ను పెంచుతాయి.
ఒక్క పరీక్ష జీవితాన్ని నిర్ణయించే వ్యవస్థ ఎంతవరకు సరైనది అన్నది ప్రపంచవ్యాప్త చర్చగా మారింది. గావోకావో గురించి మాట్లాడేటప్పుడు ఒక విషయం స్పష్టం. ఇది కేవలం పరీక్ష కాదు. ఇది ఒక దేశం యొక్క విద్యా వ్యవస్థ, సామాజిక నిర్మాణం, భవిష్యత్తును రూపొందించే శక్తివంతమైన యాత్ర.
