Venu Swamy: అదేదో సినిమాలో.. నేను పగలైతే యోగి.. రాత్రి అయితే భోగి అంటాడు బ్రహ్మానందం. వాస్తవంలో అలాంటి జీవితాన్ని అనుభవించేవారు కొంతమంది మాత్రమే ఉంటారు. అటువంటి వారిలో పరంకుశం వేణు అలియాస్ వేణు స్వామి ముందుంటారు. ఎందుకంటే ఆయన తన సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తున్న వీడియోలు అలా ఉన్నాయి మరి.
Also Read: ‘సింగర్ ఆఫ్ ది ప్యారడైజ్’ ఫుల్ మూవీ రివ్యూ…హిట్టా? ఫట్టా?
ఇటీవల అస్సాంలోని కామాఖ్య దేవి ఆలయానికి వెళ్లారు వేణు స్వామి. అక్కడి పూజారులు ఆయనను లోపలికి అనుమతించలేదు. పైగా నీలాంటివారు ఇటువంటి ఆలయానికి రాకూడదని ముఖం మీద చెప్పేశారు. ఒక రకంగా ఇది ఆయనకు చెంపపెట్టు లాంటిది. అయినప్పటికీ వేణు స్వామి తన ధోరణి మార్చుకోలేదు. మార్చుకునే వ్యక్తిత్వం కూడా ఆయనది కాదు. ఓ న్యూస్ ఛానల్ లో కూడా వేణు స్వామి గురించి బీభత్సమైన కథనాలు ప్రసారం చేశారు. వేణు స్వామి వ్యవహార శైలిని బయటపెట్టారు. వీటికి కౌంటర్ ఇవ్వడంలో వేణు స్వామి విఫలమయ్యారు. అస్సాం టూర్ విఫలమైన తర్వాత వేణు స్వామి ఇప్పుడు విదేశాలలో చక్కర్లు కొడుతున్నారు. దానికి సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పసుపు రంగు టీ షర్ట్ ధరించిన ఆయన.. విదేశాలలో లగ్జరీ ట్రైన్లలో ప్రయాణిస్తూ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.
వేణు స్వామి తన ప్రయాణానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “ఎదుటివారి జీవితంలో వేలుపెట్టి.. అడ్డగోలుగా మాట్లాడి.. చివరికి ఇలా జీవితాన్ని ఆస్వాదిస్తున్నావా” అంటూ ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. ” పసుపు రంగు టీషర్ట్ ధరించాలి కాబట్టి ఏదైనా రాజకీయ పార్టీలో చేరావా” అంటూ మరో నెటిజన్ ప్రశ్నించాడు. ఇలా రకరకాలుగా సోషల్ మీడియాలో వేణు స్వామి వీడియోపై ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. వారిలో కొంతమందికి వేణు స్వామి స్వయంగా సమాధానం ఇవ్వగా.. మిగతా వారికి ఇవ్వలేదు. మొత్తంగా ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది.
Enjoying holiday
— venu swamy(Parody) (@paulesupaadham) August 29, 2025