https://oktelugu.com/

Maruti Suzuki: ఫుల్లీ లోడెడ్.. అప్ డేటెడ్.. కొత్త మారుతి సుజుకీ డిజైర్ చూస్తే మతిపోతుంది అంతే

భారతదేశంలో కార్ల ఉత్పత్తిలో మారుతి కంపెనీ నెంబర్ వన్ స్థానంలో ఉంది. సెడాన్ కార్లకు మారుతి సుజుకీ పెట్టింది పేరు. చిన్న ఫ్యామిలీ నుంచి ఖరీదైన కాళ్లు కొనేవారు మారుతి కంపెనీ కార్ల కోసం ఎదురు చూస్తారు.

Written By:
  • Srinivas
  • , Updated On : November 14, 2024 2:39 pm
    Maruthi-Suzuki

    Maruthi-Suzuki

    Follow us on

    Maruti Suzuki: భారతదేశంలో కార్ల ఉత్పత్తిలో మారుతి కంపెనీ నెంబర్ వన్ స్థానంలో ఉంది. సెడాన్ కార్లకు మారుతి సుజుకీ పెట్టింది పేరు. చిన్న ఫ్యామిలీ నుంచి ఖరీదైన కాళ్లు కొనేవారు మారుతి కంపెనీ కార్ల కోసం ఎదురు చూస్తారు. వారికి అనుగుణంగా కంపెనీ సైతం ఎప్పటికప్పుడు ఫీచర్లను అప్డేట్ చేస్తూ కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకువస్తుంది. అయితే మారుతి నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఓ సెడన్ కారును అప్డేట్ అయి ఈ ఏడాది నవంబర్ 11న మార్కెట్లోకి వచ్చింది. దీంతో కొత్త కారు కొనాలని అనుకునేవారు దీని గురించి ఆలోచిస్తున్నారు. అయితే ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఈ మోడల్ నుంచి కొత్తగా అప్డేట్ కావడంతో ఇందులో ఎలాంటి ఫీచర్లు, డిజైన్ మార్చుకుందో తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తిగా ఉంది. ఈ నేపథ్యంలో కొత్తగా అప్డేట్ అయిన ఆ కారు గురించి వివరాల్లోకి వెళితే..

    మారుతి కార్లు అనగానే వ్యాగన్ఆర్, స్విఫ్ట్ పేర్లు గుర్తుకు వస్తాయి. వీటి తర్వాత ఎక్కువగా ‘స్విప్ట్ డిజైర్ ’కి ఎక్కువగా ఆదరణ ఉంది. 16 సంవత్సరాల కింద మార్కెట్లోకి వచ్చిన స్విఫ్ట్ డిజైర్ వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే నేటి వినియోగదారులను ఆకట్టుకునే విధంగా దీనిలో కొన్ని మార్పులు చేసి ఈ ఏడాది నవంబర్ 11న రిలీజ్ చేశారు. కొత్త డిజైర్ స్విఫ్ట్ కారును పోలి ఉంటుంది. ఇది సబ్ ఫోర్ మీటర్ సెడన్ కావడంతో ఇది SUV వలె కనిపిస్తుంది. ఇందులో అదనంగా కొత్త ఫీచర్లను యాడ్ చేశారు. ముఖ్యంగా గ్రిల్, హెడ్ లైట్స్, క్రోమ్ యాక్సెసరీస్, కొత్త అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లను అప్డేట్ చేశారు. ఫ్రెంట్ హెడ్ లైట్స్, పాత ఆడి కార్ల లైటింగ్ సిస్టం వలె కొత్త లుక్ లో కనిపిస్తున్నాయి. స్విప్ట్ డిజైర్ డిజైన్ కూడా మారిపోయింది. ఈ కొత్త కారు వెనకాల ‘వై’ ఆకారంలో స్టాప్ లైట్ క్రోమ్ కొటేషన్స్ ట్రిప్ ని అమర్చారు.

    కొత్త డిజైన్ ఇన్నర్ విషయానికి వస్తే.. ఇందులో 9 అంగుళాల డిజిటల్ స్క్రీన్ ఉంది. వైర్లెస్ ఆండ్రాయిడ్ తో పాటు ఆపిల్ కార్ ప్లే ఫీచర్లు ఆకట్టుకుంటాయి. 360 డిగ్రీ కెమెరా, వైర్లెస్ ఛార్జింగ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. నేటి తరం వారు ఎక్కువగా కోరుకునే ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ఫీచర్ ఈ కారుకు హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఫ్లాట్ బాటమ్స్ స్టీరింగ్ వీల్, పుష్ బటన్ స్టార్ట్ వంటివి ఈ కారుకు ఆకర్షణీయంగా మారాయి.సేఫ్టీ విషయంలోనూ కొత్త డిజైన్ ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లుగా ఉంది. ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్, ఏవీఎస్ విత్ ఈవిడి, ఎలక్ట్రానిక్స్ స్టెబిలిటీ కంట్రోల్ సిస్టం వంటివి ఉన్నాయి. గ్లోబల్ క్రాస్ టెస్టులో కొత్త డిజైర్ 5 స్టార్ రేటింగ్ పొందింది

    ఇక ఈ మోడల్ ఇంజన్ విషయానికి వస్తే 1.2 లీటర్ త్రి సిలిండర్ ఇంజన్ ను కలిగి ఉంది. ఇది పెట్రోల్ తో పాటు CNG ఆప్షన్లలో కూడా లభిస్తుంది. పెట్రోల్ వెర్షన్ 82 బీహెచ్ పీ పవర్, 112ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ లో పనిచేస్తుంది. మారుతి డిజైర్ GNCAP భద్రత రేటింగ్ నాల్గవ-తరం మారుతి డిజైర్ గ్లోబల్ NCAPలో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించింది. ఈ మోడల్ లీటర్ పెట్రోల్ కి 22.5 కిలోమీటర్ మైలేజ్ ఇస్తుండగా CNG 31.12 కిలోమీటర్ల మైలేజ్ ని అందిస్తుంది. ఈ కారు రూ.6.79 లక్షలకు ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. టాప్ ఎండ్ వేరియంట్ రూ.10.40 లక్షలుగా ఉంది