North Korea : ఉత్తర కొరియా సైనికులకు ఇంటర్నెట్ ఫ్రీ.. యుద్ధం పక్కన పెట్టి వాళ్ళు ఉక్రెయిన్ లో ఏం చేశారో తెలుసా?

పుస్తకాలలో మనం హిట్లర్ గురించి చదువుకున్నాం. నియంత అని ప్రస్తావిస్తే ఓహో అలా ఉండేవాడా అని ఊహించుకునేవాళ్లం.. నేటి ఆధునిక కాలంలో హిట్లర్ ను మించిన నియంత ఉన్నాడు. అతని పేరే కిమ్.

Written By: Anabothula Bhaskar, Updated On : November 8, 2024 9:09 am

North Korea

Follow us on

North Korea : కిమ్ ఉత్తరకొరియా అధ్యక్షుడు. పేరుకు అది కమ్యూనిస్టు పాలన అని చెబుతుంటారు కాని.. అదొక నియంత రాజ్యం. కిమ్ రాజ్యాంగం అక్కడ నడుస్తుంటుంది. ఆ దేశంలో ఇంటర్నెట్ బంద్. వార్తాపత్రికలు బంద్. సినిమాలు బంద్. సోషల్ మీడియా బంద్. కేవలం కిమ్ భజన కార్యక్రమాలు మాత్రమే అక్కడి ప్రజలు చూసేందుకు అవకాశం ఉంటుంది.. లేనిపక్షంలో మరణశిక్ష విధించినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. అక్కడ రాజ ద్రోహానికి పరిమితులు ఉండదు. అందుకే క్షణం క్షణం అక్కడి ప్రజలు భయపడుతూ బతుకుతుంటారు. రాజుకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడరు. అణు ఆయుధాలు, అణు ప్రయోగాలు చేస్తున్న ఉత్తరకొరియా.. దుర్భర దారిద్రంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రపంచ దేశాలతో చాలావరకు కఠిన ఆంక్షలు ఎదుర్కొంటున్నది. ఇప్పటికే అక్కడి ప్రజలు ఉపాధి లేక.. ఉద్యోగాలు లభించక నరకం చూస్తున్నారు. ఇదే సమయంలో అక్కడ కరువు కాటకాలు సంభవించి ప్రజలకు మూడు పూటలా తినేందుకు అన్నం కూడా లభించడం లేదు. దారిద్రం వల్ల ఇప్పటికే అక్కడ వేలాదిమంది కన్నుమూశారు. అక్కడ మిగతా దేశాల మీడియా ప్రతినిధులకు ఎంట్రీ ఉండదు కాబట్టి.. ప్రపంచానికి అక్కడ ఏం జరుగుతుందో తెలిసే అవకాశం లేదు. అందువల్లే కిమ్ ను ఆధునిక కాలంలో నరరూప రాక్షసుడని పేర్కొంటారు. అక్కడి సైనిక పటాలం కూడా విచిత్రంగా ఉంటుంది. ఇతర దేశాలతో యుద్ధాలు పక్కన పెడితే, కిమ్ కు ఎవరైనా వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే అక్కడి సైన్యం మొహమాటం లేకుండా చంపేస్తుంది. బుల్లెట్లను ఒంట్లోకి దించి తునా తునకలు చేస్తుంది.

అదేపనిగా చూస్తున్నారట..

చాలా సంవత్సరాల పాటు నియంత పరిపాలన లో ఉండడం.. ఇంటర్నెట్ లేకుండా బతకడంతో అక్కడి సైనికులకు కూడా కిమ్ అంటే అసహ్యం కలిగింది. అయితే వారికి ఇటీవల కాస్త స్వేచ్ఛ లభించింది. ప్రస్తుతం రష్యా దేశం ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తోంది. ఆ యుద్ధంలో పాల్గొనడానికి సైనికులు కావాలి అని కోరితే.. రష్యా కు ఉత్తరకొరియా 7000 మంది సోల్జర్స్ ను పంపింది. వారంతా ఉక్రెయిన్ సరిహద్దుల్లోకి వెళ్లారు. అయితే అక్కడ వారికి అన్లిమిటెడ్ ఇంటర్నెట్ సేవలు లభించాయి. దీంతో ఆ సైనికులు నీలి చిత్రాలకు బానిసలుగా మారారు. ఇదే విషయాన్ని ప్రముఖ పత్రిక ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది.. యుద్ధం పక్కనపెట్టి సైనికులు పగలు, రాత్రి మిగిలి చిత్రాలు చూడటంలో మునిగి తేలుతున్నారని వ్యాఖ్యానించింది. అయితే ఉత్తర కొరియాలో ఇంటర్నెట్ ఉండదు. ఒకవేళ ఉన్నప్పటికీ.. ప్రభుత్వం అనుమతించిన వెబ్ సైట్ లు చూసేందుకు మాత్రమే అవకాశం లభిస్తుంది. అయితే ఉత్తరకొరియా సైనికులు ఉక్రెయిన్ సరిహద్దుల్లో చేస్తున్న పని చూసి రష్యా సైనిక అధికారులు తలలు పట్టుకుంటున్నారట.