Snowfall in Saudi Arabia: సౌదీ అరేబియా.. ఈ పేరు గుర్తుకు వస్తే చాలు మదిలో ఇసుక తిన్నెలు మెదులుతాయి. సాధారణంగా సౌదీ అరేబియా దేశంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుంటాయి. పైగా అక్కడ వర్షం కురిసేది చాలా తక్కువ కాబట్టి ఎడారి ప్రాంతం అధికంగా ఉంటుంది. ఒకవేళ వర్షాలు కురిసినప్పటికీ అవి ఇసుక తుఫాన్ల మాదిరిగా ఉంటాయి. అందువల్లే సౌదీ దేశంలో ఎక్కువగా ఎడారి వాతావరణం ఉంటుంది. ఎక్కడో ఒకచోట ఒయాసిస్ లాంటి ప్రాంతాలు కనిపిస్తుంటాయి. అక్కడ కాస్త నీరు ఉంటుంది కాబట్టి ఖర్జూర వృక్షాలు విస్తారంగా కనిపిస్తుంటాయి.
వేడి వాతావరణానికి, ఇసుక తిన్నెలకు పెట్టింది పేరైన సౌదీ దేశంలో ఇప్పుడు విచిత్రమైన వాతావరణం కనిపిస్తోంది. ఆ ప్రాంతంలో మంచుకొండలు విపరీతంగా దర్శనమిస్తున్నాయి. ఎడారి దేశం కాస్త కాశ్మీర్ మాదిరిగా కనిపిస్తోంది. విపరీతమైన ఎండ.. ఇసుక తిన్నెల వాతావరణాన్ని ఇన్ని రోజులపాటు చూసిన అక్కడ ప్రజలు.. ఇప్పుడు అకస్మాత్తుగా వాతావరణం మారడంతో ఒకసారిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సౌదీ అరేబియా దేశంలోని ఉత్తర ప్రాంతాలైన తబుక్, ఆల్ జాఫ్ , హైల్ లో మంచు దట్టంగా కురుస్తోంది. జబల్ ఆల్ లౌజ్ పర్వతం మొత్తం హిమాలయ శిఖరం మాదిరిగా కనిపిస్తోంది. ఇసుక తిన్నెల మీద మంచు పరుచుకొని తెల్లగా దర్శనమిస్తోంది. సౌదీ అరేబియా దేశంలో మంచు కురవడం కొత్త కాకపోయినప్పటికీ.. గడిచిన 30 సంవత్సరాల కాలంలో మంచు ఈ స్థాయిలో కురవడం ఇదే తొలిసారి అని అక్కడి ప్రజలు చెబుతున్నారు.
సౌదీ అరేబియా దేశంలో వాతావరణ మార్పుల వల్లే మంచు కురుస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.. సౌదీ దేశంలో ప్రముఖమైన అరేబియా సముద్రంలో అల్పపీడన ద్రోణి, ఉత్తర ప్రాంతం నుంచి వచ్చే చల్లటి గాలుల వల్ల అక్కడ ఉష్ణోగ్రతలు ఏకంగా -4 డిగ్రీలకు పడిపోయాయి. అందువల్ల గాలిలో తేమ కనిష్ట ఉష్ణోగ్రతల కారణంగా మంచు కురవడానికి కారణమవుతోంది. ఇలా మంచు కురవడం వల్ల ఆ ప్రాంతం మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. సౌదీ అరేబియాలో ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో చూసిన వారంతా ఇదంతా నిజమా? కృత్రిమ మేధ ద్వారా సృష్టించిన అద్భుతమా? అను సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
కేవలం మంచు మాత్రమే కాదు ఈ ప్రాంతంలో వర్షాలు కూడా విపరీతంగా కురుస్తున్నాయి. సౌదీ ప్రభుత్వం ఏకంగా అత్యయిక పరిస్థితిని విధించింది అంటే అక్కడ వరదలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కేవలం సౌదీ మాత్రమే కాదు, దుబాయ్, ఖతార్ వంటి దేశాలలో కూడా వాతావరణం విచిత్రంగా కనిపిస్తోంది. దీని అంతటికి గ్లోబల్ వార్మింగ్ కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
First time in history Saudi Arabian desert turns into winter wonderland after first-ever snowfall.
For the first time in recorded history Saudi Arabia’s Al-Jawf region experienced snowfall turning the dry desert into a winter scene. pic.twitter.com/X2XCGBt3aY— The Lowdown (@D_lowdown) November 5, 2024