Killing Stone: నమ్మకాలు మనుషులను నిలబెడుతాయి. ఆ నమ్మకాలపై అందరూ జీవిస్తున్నారు. జపాన్ లో అయితే ఈ మూఢ నమ్మకాలు మరీ ఎక్కువ. ఇప్పుడు అక్కడ ఒక బండరాయి పగిలిపోవడం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. జపాన్ లోని నాసు ప్రాంతంలో ఉండే ఈ రాయి పేరు సెష్షో-సెకి. ఈ రాయిని ఎవరైనా తాకితే చనిపోతారని జపాన్ ప్రజల గట్టి నమ్మకం.

జపాన్ పురాణాల ప్రకారం.. దుష్టశక్తి అయిన 9 తోకల నక్క ఆత్మను బంధించారని స్థానికులు నమ్ముతారు. పురాతనకాలంలో ఈ నక్క అందగత్తె రూపంలో వచ్చి చక్రవర్తిని చంపడానికి ప్రయత్నించిదట.. అప్పుడు దాన్ని ఓడించిన వాళ్లు ఆ దుష్టశక్తిని ఈ రాయిలో బంధించారనేది పురాతన కథ ప్రచారంలో ఉంది.
1957లో ఈ ప్రాంతాన్ని చారిత్రక ప్రదేశంగా గుర్తించిన ప్రభుత్వం టూరిస్ట్ స్పాట్ గా దీన్ని అభివృద్ధి చేసింది. ఈ క్రమంలోనే దీన్ని చూడడానికి ఆదివారంవెళ్లిన వారికి రెండు ముక్కలై కనిపించిదీ రాయి. అంతే అక్కడి ప్రజలు భయంతో వణికిపోయారు.
ప్రపంచం అంతం అయిపోతుందని..ఈఱోజు చూడకూడని విషయం చూశానని అంటూ ఒక వ్యక్తి ఈ రాయి ఫొటోను ట్విట్టర్ లో పంచుకున్నారు. దీంతో నెటిజన్లు దీనిపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ‘వెయ్యి సంవత్సరాల తర్వాత ఆ రాక్షసి బయటకు వచ్చేసి పారిపోయినట్లుంది’ అంటున్నారు.
పగిలిన బండరాయిపై అంతకుముందే చీలికలు ఉన్నాయని..చలి కారణంగానే అది పగిలిపోయిందన్న వాదనను నిపుణులు చెబుతున్నారు. అయితే అది పలగడం జపాన్ తోపాటు ప్రపంచానికే ప్రమాదం అని.. భూకంపాలు, సునామీలు వచ్చి ప్రపంచం అంతమైపోతుందని ప్రజలు భయపడుతున్నారు.