Donald Trump : అమెరికా అధ్యక్షుడిగా తాను గెలిస్తే నాన్ అమెరికన్లను తరిమివేస్తా.. మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్(Make America Great Again) అన్న నినాదంతో పనిచేస్తా అని ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారం చేశాడు. ఆ ప్రచారమే ట్రంప్‌కు కలిసి వచ్చింది. ట్రంప్ మొదటి పాలన అమెరికన్లకు నచ్చలేదు. దీంతో రెండోసారి ఓడించారు. కానీ, మళ్లీ అమెరికన్టు ట్రంప్‌వైపే మొగ్గు చూపారు. దీంతో తనను గెలిపించిన అమెరికన్లను సంతృప్తి పరిచేలా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజే అఏక కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. వైట్‌హౌస్‌లో అడుగు పెట్టగానే ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్(Exicutive Orders)లో బాగా చర్చ జరుగుతున్నది జన్మతః వచ్చే పౌరసత్వం రద్వు చేయడమే. అమెరికన్లకు పెట్టినవారికి అమెరికా పౌరసత్వం వస్తుంది. ఇక గ్రీన్‌కార్డు ద్వారా వచ్చే పౌరసత్వాలే ఫైనల్. వాటికి ఉన్న కోటా దరఖాస్తులతో పోలిస్తే వందేళ్లయినా చాలా మందికి అవకాశం రాదు.
అందరిదీ ఒక రూల్.. ఆయనది మరో రూల్..
ప్రపంచంలో ఏ దేశంలో అయినా తమ దేశంలో, తమ పౌరులకు పుట్టిన పిల్లకే పౌరసత్వం ఇస్తారు. ఇలా రాజ్యాంగాల్లోనూ పొందుపర్చారు. దీనివలన వలసదారుల పిల్లలు, పౌరసత్వం లేనివాళ్లు, కాన్పు కోసం అమెరికా వెళ్లిన వాళ్లకు పుట్టిన పిల్లలకూ అమెరికా పౌరసత్వం వచ్చేది. ఇలా అమెరికా పౌరులుగా మారిన జనాభా చాలా మంది ఉన్నారు. పిల్లలు అమెరికన్, తల్దిండ్రులు మాత్రం వీసాల మీద ఉండేవారు లక్షల్లోనే ఉన్నారు. ట్రంప్ నిర్ణయంతో ఇకపై ఆ అవకాశం ఉండదు.
అక్కడే సెటిల్ కావాలని..
భారతీయులు డాలర్ డ్రీమ్.. అమెరికాలో సెటిల్ కావాలనే దీనికి వారు వివిధ పద్ధతులు అవలంబిస్తున్నారు. ఉన్నత చదువులు భారత్‌లో చదివి. అమెరికాకు ఊడిగం చేస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు. అక్కడి డాలర్ విలువ ఎక్కువ. మన రూపాయి విలువ తక్కువ అందుకే చాలా మంది అమెరికాబాట పడుతున్నారు. కొందరు చదువులు పేరుతో. మరికొందరు ఉద్యోగాల పేరుతో.. ఇంకొందరు డెలివరీ పేరుతో అగ్రరాజ్యం బాట పడుతున్నారు. ఈ కారణాలతో లక్షల మంది ఇప్పటికే అక్కడ సెటిల్ అయ్యారు. స్వదేశానికే చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్నారు. కానీ ట్రంప్ నిర్ణయంతో ఇక అమెరికాలో పరాయివారిగా బతకాల్సిన పరిస్థితి. ఈ భావన ఇప్పుడు భారతీయుల్లో ఆందోళన కలిగిస్తోంది. దీంతో అమెరికా వెళ్లాలన్న ఆలోచన తగ్గిపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవేళ వెళ్లినా అక్కడ ఉండలేమని ఇక ఫిక్స్ అవ్వాల్సిందే. ఎప్పటికైనా ఇండియాకు రావాలన్న ఆలోచనలతోనే అమెరికా వెళ్తారు. ట్రంప్ పౌరసత్వ మార్పుతో అమెరికాకు ఏమేరకు లాభం కలుగుతుందో తెలియదు కానీ, ఇండియన్స్ నుంచి మేధో వలసలు మాత్ర తగ్గే అవకాశం ఉంది.