Homeఅంతర్జాతీయంTedros Adhanom: ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే..

Tedros Adhanom: ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే..

Tedros Adhanom: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) నుంచి అమెరికా వైదొలిగింది. ఈమేరకు అధికారికంగా ప్రకటించింది. కోవిడ్‌ నియంత్రణలో డబ్ల్యూహెచ్‌వో విఫలమైన నేపథ్యంలో తాము వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. దీంతో డబ్ల్యూహెచ్‌వో కూడా స్పందించింది. ఇప్పటి వరకు ఉన్న బకాయిలు చెల్లించాలని సూచించింది. దీనికి అమెరికా వైదొలిగేవారు బకాయిలు చెల్లించాలన్న రూల్‌ లేదని కౌంటర్‌ ఇచ్చింది. దీంతో వివాదం ముదిరింది.

స్పందించిన డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌..
అమెరికా ఆరోపణలపై డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ ఘెబ్రెయెసస్‌ స్పందించారు. అమెరికా నిష్క్రమణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా సమాచారం దాచామనే ఆరోపణలు ఖండించారు. తాము సకాలంలో స్పందించామని స్పష్టం చేశారు. అమెరికా వైదొలగడానికి దీనిని ఒక సాకుగా చూపుతోందని ఆరోపించారు. ఈమేరకు ఎక్స్‌లో ఒక పోస్టు చేశారు. అమెరికా తిరిగి డబ్ల్యూహెచ్‌వోలో చేరి సహకరించాలని కోరారు.

అమెరికా ఆరోపణలు
ఇదిలా ఉంటే జనవరి 22న అమెరికా ఆరోగ్య మంత్రి కెనడీ జూనియర్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో సంయుక్త ప్రకటన విడుదల చేశారు. కరోనా వ్యాప్తిపై డబ్ల్యూహెచ్‌వో సమయానుకూల సమాచారం ఇవ్వలేదని తెలిపారు. దీనివల్ల అమెరికాలో అనేక ప్రాణనష్టం జరిగిందని ఆరోపించారు. ఈ కారణంగా సంస్థ నుంచి వైదొలిగామని పేర్కొన్నారు.

ఈ వివాదం అమెరికా–డబ్ల్యూహెచ్‌వో సంబంధాల్లో విభేదాలను సూచిస్తోంది. భవిష్యత్‌ మహమ్మారుల్లో సహకారం దెబ్బతింటుందనే ఆందోళనలు తలెత్తాయి. టెడ్రోస్‌ ఆశాభావం ఉన్నా, రాజకీయ ఒత్తిడి పెరుగుతోంది. ప్రపంచ దేశాలు ఇప్పుడు డబ్ల్యూహెచ్‌వోపై ఆధారపడటం పెరుగుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular