Embarrassment for Pakistan: భారత వ్యతిరేక దేశం పాకిస్తాన్. ఎప్పుడూ మన కీడు కోరుకుంటూ, మన అభివృద్ధిని చూసి ఏడుస్తూ ఉంటుంది. తన దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చుకోకుండా.. ప్రపంచ దేశాలను అడుక్కతింటుంది. ఇస్లామిక్ దేశాలు మినహా ఇతర దేశాలతో సత్సబంధాలు లేని పాకిస్తాన్ పరువు తాజాగా బ్రిటన్ రోడ్లపై పడింది.
పాకిస్తాన్ ఇంటీరియర్ మినిస్టర్ మోహిసీన్ నఖ్వీ ఇటీవల బ్రిటన్ పర్యటనకు వెళ్లారు. అయితే అధికారిక పర్యటన అయినా లండన్ పోలీసులు నఖ్వీని గుర్తించలేదు. దీంతో అతడి కారును ఆపి రోడ్డుపై నిలబెట్టారు. కారు తనిఖీ చేశారు. దీంతో దేశానికి అంతర్జాతీయ గౌరవం లేదా మర్యాద ఎలా ఉందో తెలిసిపోయింది. సాధారణంగా ఇతర దేశ మంత్రులకు ఎవరైనా ప్రాధాన్యం ఇస్తారు. కానీ పాకిస్తాన్‌కు ఘోర అవమానం జరిగింది.
అంతర్జాతీయ అవమానం..
పాకిస్తాన్‌లోని నాయకులు తమ దేశ రాజకీయాల్లో ఉన్న పెద్దతనంతో గర్వపడతారు కానీ, అంతర్జాతీయ వేదికల్లో వారి ప్రతిష్ట అంతస్థు పతనంగా ఉండటం గమనార్హం. ఇలాంటి సంఘటనలు పాకిస్తాన్ రాజకీయల అంతరంగ పరిస్థితులను బయటపెట్టడంతోపాటు, అంతర్జాతీయ ప్రాముఖ్యతలో పాకిస్తాన్‌కు ఏపాటి గౌరవం ఉందో ఈ ఘటన ద్వారా నిరూపితమైంది.
ఆంతర్జాతీయ ప్రభావం…
లండన్‌లో జరిగిన ఈ ఘటన వెనుక ప్రభుత్వాల మధ్య వాస్తవ రాజకీయాలు, భద్రతా సమస్యలు, రెండు దేశాల మధ్య నెలకొన్న అవిశ్వాసం కారణాలు అయి ఉంటాయని భావిస్తున్నారు. అంతర్జాతీయ రాజకీయాలలో మిత్రదేశాలు కాకపోయినా మర్యాద ఉంటుంది. కానీ పాకిస్తాన్‌కు ఆ మర్యాద కూడా దర్కలేదు.
ఈ సంఘటన పాకిస్తాన్ ప్రాముఖ్యత అంతర్జాతీయ స్ధాయిలో తక్కువగా ఉండడాన్ని సూచిస్తుంది. భారతదేశం, అమెరికా మాదిరిగా ప్రత్యక్ష రాజకీయ సంబంధాలు, అంతర్గత పరిస్థితులతో అధిక గౌరవం పొందుతుంది. పాకిస్తాన్ బ్రిటన్‌తో ఏమాత్రం విభేదాలు లేవు.. అయినా కనీస గౌరవం పొందలేదు.