Elon Musk
Elon Musk: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.టెస్లా సీఈఓ అయిన ఎలాన్ మస్క్ తన 14వ బిడ్డకు తండ్రి అయ్యాడు. అయితే ఆయన తండ్రి అయిన విషయం పై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఎలోన్ మస్క్ తో సహజీవనం చేస్తున్న శివోన్ జిలిస్ ఈ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సందర్భంగా మోడీ, మస్క్ లతో కలిసి కనిపించిన మహిళనే శివోన్ గిల్లిస్.
ఈ బిడ్డ గురించిన వార్తను శివోన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో ప్రకటించారు. ఇది శివోన్‌కు నాల్గవ సంతానం.. ప్రస్తుతం పుట్టిన కొడుకుకు సెల్డన్ లైకుర్గస్ అని పేరు పెట్టాడు. శివోన్ మూడవ సంతానం అర్కాడియా అనే కుమార్తె. 53 ఏళ్ల మస్క్ శివోన్ పోస్ట్‌కి హార్ట్ ఎమోజీని పంపాడు. ఇది మస్క్ కి షివోన్ తో నాల్గవ సంతానం.
Also Read: ఉద్యోగుల తొలగింపునకు బ్రేక్.. ట్రంప్ నిర్ణయంపై కోర్టు స్టే!
ఈ విషయాలన్నీ షివాన్ X లో ప్రస్తావించారు. తన మూడవ బిడ్డ అర్కాడియా మొదటి పుట్టినరోజున గిల్లిస్ ఈ సంతోషకరమైన వార్తను షేర్ చేశారు. “ఎలాన్ తో చర్చల తర్వాత, అందమైన ఆర్కాడియా పుట్టినరోజు నాడు మా కుమారుడు సెల్డాన్ లైకుర్గస్ ను ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం” అని వారు Xలో రాశారు. అయితే మస్క్ ఈ బిడ్డ తనదే అని ఒప్పుకోలేదు.. అలాగని తిరస్కరించనూ లేదు.
ఎలోన్ మస్క్ కు ఇప్పుడు మొత్తం 14 మంది పిల్లలు ఉన్నారు. అతనికి మొదటి భార్య జస్టిన్ విల్సన్ తో ఆరుగురు పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలలో ఒకరైన నెవాడా అలెగ్జాండర్ 10 వారాల వయసులో మరణించాడు. మస్క్ కు గాయని గ్రిమ్స్ తో ముగ్గురు పిల్లలు ఉన్నారు. మస్క్ కు శివోన్ గిల్లిస్ తో నలుగురు పిల్లలు ఉన్నారు. ఇవి కాకుండా రచయిత్రి ఆష్లే సెయింట్ క్లైర్ ఇటీవల తన 5 నెలల బిడ్డకు మస్క్ తండ్రి అని పేర్కొన్నారు. ఇప్పటివరకు మస్క్, గిల్లిస్ తమ మూడవ, నాల్గవ పిల్లల (ఆర్కాడియా, సెల్డన్) పేర్లు, గుర్తింపులను సీక్రెట్ గా ఉంచారు.
శివోన్ గిల్లిస్ ఎవరు?
శివోన్ గిల్లిస్ ఎలోన్ మస్క్ లవర్. ఆమె మస్క్ కంపెనీ న్యూరాలింక్‌లో డైరెక్టర్. న్యూరాలింక్ అనేది మెదడు, కంప్యూటర్లను అనుసంధానించడంలో పనిచేసే ఓ సంస్థ. గిల్లిస్ 2017 నుండి 2019 వరకు మస్క్ కంపెనీ టెస్లాలో ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. గిల్లిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)లో నిపుణురాలు.తను ఆటోపైలట్, చిప్-డిజైనింగ్‌లో తన AI నిష్ణాతురాలు.
Discussed with Elon and, in light of beautiful Arcadia’s birthday, we felt it was better to also just share directly about our wonderful and incredible son Seldon Lycurgus. Built like a juggernaut, with a solid heart of gold. Love him so much ♥️
— Shivon Zilis (@shivon) February 28, 2025