Homeఅంతర్జాతీయంElon Musk: ఎలాన్‌ మస్క్‌ అణుయుద్ధ హెచ్చరిక.. పుతిన్‌ భారత పర్యటన వేళ కీలక చర్చ!

Elon Musk: ఎలాన్‌ మస్క్‌ అణుయుద్ధ హెచ్చరిక.. పుతిన్‌ భారత పర్యటన వేళ కీలక చర్చ!

Elon Musk: ప్రపంచంలో అనేక యుద్ధాలు జరుగుతున్నాయి. రష్యా–ఉక్రెయిన్, ఇజ్రాయెల్‌–ఇరాన్, పాలస్తీనా, పాకిస్తాన్‌–ఆఫ్గానిస్తాన్‌ యుద్ధాలు కొనసాగుతున్నాయి. ఇక భారత్‌–పాకిస్తాన్‌ యుద్ధం ఆపరేషన్‌ సిందూర్‌ హోల్డ్‌లో ఉంది. ఇలాంటి పరిస్థితిలో ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే 5–10 సంవత్సరాల్లో ప్రపంచ యుద్ధం, బహుశా అణుయుద్ధం జరిగే అవకాశం ఉందని ఎక్స్‌లో పోస్టుకు స్పందిస్తూ ప్రకటించారు. అణుఆయుధాలు ప్రధాన శక్తుల మధ్య యుద్ధాన్ని నిరోధిస్తాయనే నమ్మకం వల్ల బాహ్య ఒత్తిడి లేకపోవడం ఈ ప్రమాదానికి కారణమని సూచించారు.

ప్రపంచంలో ఉద్రిక్తతలు
రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం, ఇజ్రాయెల్‌–ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు, చైనా–తైవాన్‌ పొరుగు వివాదాలు ప్రపంచాన్ని అణుయుద్ధ మేఘాలకు దగ్గర చేస్తున్నాయి. భారత్‌–చైనా, భారత్‌–పాకిస్తాన్‌ సరిహద్దు ఘర్షణలు, నాటో–రష్యా ఒత్తిడి ఈ పరిస్థితిని తీవ్రతరం చేస్తున్నాయి. సెంటర్‌ ఫర్‌ న్యూ అమెరికన్‌ సెక్యూరిటీ భారత్‌–చైనా యుద్ధ స్థిరత్వాన్ని హెచ్చరించింది.

పుతిన్‌ వరుస పర్యటనలు..
పుతిన్‌ ఇటీవల బెలారస్‌కు వెళ్లారు. ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో అమెరికా వెళ్లారు. చైనా వెళ్లాకు తజకిస్తాన్, కజకిస్తాన్‌లో కూడా పర్యటించారు. ఇప్పుడు భారత్‌కు వస్తున్నారు. భారత పర్యటనలో ఎస్‌ 500 ఒప్పందం జరిగే అవకాశం ఉంది. 2023 నాటికి వంద బిలియన్‌ డాలర్ల ఆయుధాల విక్రయానికి ఒప్పందం జరిగే అవకాశం ఉందని పుతిన్‌ కూడా ప్రకటించారు. ఇక లాజెస్టిక్స్‌ అగ్రిమెంట్‌ కూడా జరిగే అవకాశం ఉంది. అమెరికా ఆంక్షల నేపథ్యంలో మన ఉత్పత్తుల కొనుగోలుకు రష్యాతో ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది. ఇప్పటికే సింగపూర్, ఫ్రాన్స్‌తో, ఆస్ట్రేలియాతో ఇటీవల వాణిజ్య ఒప్పందం జరిగింది. ఇప్పుడు రష్యాతో కూడా రెలోజ్‌ ఒప్పందం జరిగే అవకాశం ఉంది.

పుతిన్‌ పర్యటన వేళ కీలక చర్చ..
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ రెండు రోజుల్లో భారత్‌కు రానున్నారు. ఇలాంటి పరిస్థితిలో అణుయుద్ధం హెచ్చరికలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. మస్క్‌ వ్యాఖ్యలు ఉద్రిక్తతలకు ఆజ్యం పోశాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version