Elon Musk: అమెరికాకు చెందిన టెస్లా సీఈవో, ప్రపంచ కుబేరుడు అయిన ఎలాన్ మస్క్ ప్రపంచ వ్యాప్తంగా తన వ్యాపారాలను విస్తరిస్తున్నారు. లక్షల కోట్ల లాభాలు గడిస్తున్నారు. మరోవైపు అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్నారు. ఇంకోవైపు మనిషి మెదడులో చిప్ ఏర్పాటు చేసే పరిశోధనలు సాగిస్తున్నారు. అంధులు, బుద్ధిమాంద్యంతో బాధపడుతున్నవారిని అందరిలా మార్చేలా ప్రయోగాలు చేస్తున్నారు. ఇలా అనేక పరిశోధనలు, ప్రయోగాలలో పెట్టుబడి పెడుతున్నా మస్క్.. ఇప్పుడు రాజకీయాల్లోనూ యాక్టివ్ అవుతున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేల ఆయన పొలిటికల్‌గా చాలా యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతు ఇస్తున్నారు. ఆయన ఎన్నికల ప్రచారంలోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. అరుణ గ్రహంపై ప్రయోగాల కోసమే ట్రంప్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని తనపై వచ్చిన విమర్శలపై తాజాగా మస్క్ స్పందించారు. తన మనసులోని మాటను బయట పెట్టారు.
అందుకోసమే రాజకీయాల్లోకి..
అంగారక గ్రహంపై మానవాళి జీవనం సాగించాలని మస్క్ కొంతకాలంగా వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన మార్స్‌పై దృష్టిపెట్టారు. అంగారకుడిపై మానవ కాలనీలు స్థాపించాలని అనుకుంటున్నారు. భవిష్యత్‌లో అక్కడ పర్యటనలు సాధ్యమయ్యేలా ప్రయోగా చేయాలనుకుంటున్నారు. అందుకే ఆయన రాజకీయాల్లో యాక్టీవ్‌గా ఉంటున్నారని ఓ నెటిజన్ ఎక్స్‌లో ట్వీట్ చేశాడు. దీనిపై మస్క్ స్పందించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలవడం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. మార్స్‌పై చేరుకోవడంతోపాటు అక్కడ జీవించేందుకు ప్రయోగాలకు వీలవుతుందని పేర్కొన్నారు. ఆయన గెలుపుతో పెద్ద మార్పు వస్తుంది అని భావిస్తున్నాను అని వెల్లడించారు. అందుకే రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటున్నట్లు చెప్పారు. ఈమేరు నెటిజన్‌కు రిప్లై ఇచ్చారు. తాజాగా మస్క్ పోస్టు వైరల్‌గా మారింది. తాను అంగారక గ్రహం మీదనే చనిపోవాలని అనుకుంటున్నట్లు మస్క్ గతంలో తెలిపారు. ఈ క్రమంలోనే ఆయన మార్స్‌పైకి మనుషులను పంపే ప్రయోగాలు చేస్తున్నారు.
మార్స్‌పై కాలనీలు..
ఇక మార్స్‌పై మానవ కీలనీలు ఏర్పాటు చేయడమే తన లక్ష్యమని మస్క్ చెబుతున్నారు. మానవాళిని బహుల గ్రహ జాతులుగా మార్చాలని అనుకుంటున్నట్లు చెప్పారు. 30 ఏళ్లలో అంగారకుడిపై నగరం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అక్కడ మనుషులు కూడా జీవిస్తారని ఆయన ఇప్పటికే అంచనా వేశారు. ట్రంప్ గెలిస్తే.. వచ్చే ఐదేళ్లలోనే అంగారకుడిపైకి మానవ రహిత యాత్ర చేపట్టాలనే ఆలోచనలో ఉన్నారు. 10 ఏళ్లలో అక్కడికి మనుషులను పంపేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. 20 ఏళ్లలో నగరాన్ని నిర్మించాలని భావిస్తున్నారు. 30 ఏళ్లలో అక్కడ సురక్షితంగా నాగరికత విరాజిల్లుతుందని మస్క్ భావిస్తున్నారు.